Begin typing your search above and press return to search.
'హిరణ్య కశ్యప' బాహుబలి రేంజ్ లో తీస్తామంటున్న స్టార్ ప్రొడ్యూసర్
By: Tupaki Desk | 2 May 2020 9:30 PM ISTరానా హీరోగా గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే హిరణ్య కశ్యప చిత్రం బాహుబలి రేంజ్ లో ఉంటుందని అంటున్నారు ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం సినిమా పరిశ్రమలో టెక్నాలజీ బాగా పెరిగిందని, ముందు ముందు డిజిటల్ ప్లాట్ ఫామ్ పైనే ఆధారపడి ఉండాలని అంటున్నాడు. ఇక సినిమా పరిశ్రమలో చాలా సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిపారు. అలాగే తన బ్యానర్ లో హిరణ్య కశ్యప పేరుతో పిరియాడికల్ సినిమా ఉంటుందని చెప్పాడు. రానా హీరోగా నటిస్తున్న ఈ సినిమా కోసం దాదాపు రెండున్నరేళ్లుగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుతున్నాం. ఈ సినిమా ప్రీ విజువలైజేషన్ కోసం వందమంది పనిచేస్తున్నారు. అదంతా పూర్తయ్యాక సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తాం.
ఈ చిత్రాన్ని బాహుబలి రేంజ్ లో తీయాలన్న ఆలోచనలో ఉన్నాం. ఇండియాలోనే అతిపెద్ద సినిమాగా మారొచ్చు అంటూ హింట్ ఇచ్చారు. ఇక ‘రుద్రమదేవి’ సినిమా తర్వాత ‘హిరణ్య కశ్యప’ సినిమాను ప్రకటించాడు డైరెక్టర్ గుణశేఖర్. దగ్గుపాటి రానా హిరణ్యకశ్యకుడిగా నటించబోతున్నాడని కూడా ప్రకటించాడు. రానా ఎప్పటి నుండో కోరుకుంటున్న ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ కు రూ.180 కోట్ల భారీ బడ్జెట్ అవుతుందని అంచనా వేశారు. రేపో మాపో ఈ మూవీ ప్రారంభమవుతుందని గుణశేఖర్ ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న తరుణంలో కరోనా సంక్షోభం వచ్చింది. అందరూ ఈ సినిమా ఆగిపోయింది అని అనుకున్నారు. తాజాగా ఓ పత్రిక ఇంటర్వ్యూలో సురేష్ బాబు 'హిరణ్య కశ్యప’ తప్పక ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం సురేష్ బాబు తన సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై సొంతంగా సినిమాలు తీయకుండా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ వారి బ్యానర్స్ లో పార్ట్నర్ గా వ్యవహరిస్తున్నాడు.