Begin typing your search above and press return to search.

మరో పాన్ ఇండియా మూవీకి రానా గ్రీన్ సిగ్నల్..!

By:  Tupaki Desk   |   1 May 2021 6:00 AM IST
మరో పాన్ ఇండియా మూవీకి రానా గ్రీన్ సిగ్నల్..!
X
దగ్గుబాటి వారసుడిగా ఇండస్ట్రీలో హీరోగా పరిచయమైన హ్యాండ్సమ్ హంక్ రానా.. వైవిధ్యమైన కథలు, విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. 'బాహుబలి' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని.. ప్రస్తుతం తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లో కూడా సినిమాలు చేస్తున్నారు. ఇటీవల 'అరణ్య' అనే త్రిభాషా చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పటికే 'విరాటపర్వం' సినిమాని కంప్లీట్ చేసిన రానా.. పవన్ కళ్యాణ్ తో కలిసి 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

'టాప్ హీరో' 'దేవుడు' 'జంబలకిడి పంబ' వంటి సినిమాలను నిర్మించిన విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్ లో రానా కొత్త చిత్రం రూపొందనుంది. విశ్వశాంతి పిక్చర్స్ అధినేత ఆచంట గోపినాథ్ ఈ సినిమాని నిర్మాత సీహెచ్ రాంబాబుతో కలిసి నిర్మించనున్నారు. '#PSPKRana' సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న ఈ సినిమా కథ, కథనం, హీరో క్యారక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటాయని.. దర్శకుడు, సాంకేతిక నిపుణులు, నటీనటులు ఇతర వివరాలను త్వరలో ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు.