Begin typing your search above and press return to search.

భల్లాల దేవుడి అవార్డు బోణీ

By:  Tupaki Desk   |   21 Nov 2015 1:29 PM IST
భల్లాల దేవుడి అవార్డు బోణీ
X
ఈ ఏడాది భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ‘బాహుబలి’ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. దేశ విదేశాల్లో ఈ సినిమా మీద ప్రశంసల జల్లు కురిసింది. థియేట్రికల్ రన్ అంతా పూర్తయ్యాక కూడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో విదేశీ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటూ సంచలనాల మోత మోగిస్తూనే ఉంది ‘బాహుబలి’. ఇప్పుడిక బాహుబలి అవార్డుల వేట కూడా మొదలైంది.

ఐతే ముందుగా బోణీ కొట్టింది బాహుబలి కాదు, భల్లాల దేవుడు. ఈ క్యారెక్టర్ పోషించిన రానా దగ్గబాటికి ‘ఆసియా విజన్ మూవీ అవార్డ్’ దక్కింది. నిన్న రాత్రి ట్విట్టర్ లో ఈ విషయాన్ని ప్రకటించాడు రానా. డిసెంబరు 2న డిసెంబర్ లో ఈ అవార్డుల్ని అందజేయబోతున్నారు. సౌత్ ఇండియన్ సినిమా విభాగంలో రానా ఈ అవార్డుకు ఎంపికయ్యాడు.

బాహుబలి సినిమాకు, దర్శకుడు రాజమౌళికి, బాహుబలి పాత్రధారి ప్రభాస్ కు కాకుండా.. భల్లాలదేవుడి పాత్ర చేసిన రానాకు అవార్డు రావడం విశేషమే. ఐతే మున్ముందు బాహుబలి రికార్డుల వేట కొనసాగుతుందని.. మిగతా వాళ్లు కూడా అవార్డులు కొల్లగొడతారని బాహుబలి టీం సభ్యులు చెబుతున్నారు. ఈ ఏడాదికి జాతీయ అవార్డుల్లో ‘బాహుబలి’ బ్యాగ్ ఫుల్ అయిపోవడం ఖాయమని అంచనా.