Begin typing your search above and press return to search.

జనాలు మర్చిపోయిన రానా '1945' రాబోతుంది

By:  Tupaki Desk   |   10 Dec 2020 1:00 PM IST
జనాలు మర్చిపోయిన రానా 1945 రాబోతుంది
X
రానా హీరోగా రెజీనా హీరోయిన్‌ గా '1945' అనే సినిమా తెరకెక్కింది. తమిళ దర్శకుడు సత్యశివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం మరియు హిందీలో కూడా విడుదల చేయబోతున్నట్లుగా అప్పుడు చెప్పాడు. మూడు సంవత్సరాల క్రితం తెరకెక్కిన ఈ సినిమా అనేక కారణాల వల్ల మద్యలో ఆగిపోయింది. సినిమా షూటింగ్‌ మళ్లీ పునః ప్రారంభం అవుతుంది అనుకున్న ప్రతి సారి కూడా సినిమాను పక్కకు పెడుతూ వచ్చారు. ఎట్టకేలకు ఈ సినిమాను పూర్తి చేసి విడుదల చేస్తాం అంటూ తెలుగు వర్షన్‌ నిర్మాత అయిన సి కళ్యాణ్‌ క్లారిటీ ఇచ్చాడు.

ఈ సినిమాలో రానా స్వాతంత్ర్య సమరయోధుడు అయిన సుభాష్‌ చంద్రబోస్‌ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆర్మీ ఆఫీసర్‌ గా రానా కనిపించబోతుండగా రెజీనా ఆయన ప్రేయసిగా నటిస్తున్నట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. సినిమా పై అప్పట్లో సినీ వర్గాల్లో చాలా ఆసక్తి వ్యక్తం అయ్యింది. జనాలకు సినిమా రీచ్‌ అయ్యే సమయానికి ఏవో కారణాల వల్ల సినిమాను పక్కకు పెట్టేశారు. మూడు సంవత్సరాలు రానా సినిమా పక్కకు పెట్టడంతో జనాలు ఆ సినిమా గురించి మర్చి పోయారు. జనాలు పూర్తిగా మర్చి పోయిన ఈ సమయంలో మళ్లీ ఆ సినిమాను విడుదల చేస్తామంటూ సి కళ్యాణ్‌ ప్రకటించడం చర్చనీయాంశం అయ్యింది. ఆగిపోయిన ఆ సినిమాను మళ్లీ తీసుకు రావడం అనేది సాధ్యమేనా అనేది చూడాలి.