Begin typing your search above and press return to search.

నా సినిమా థియేటర్లోనే రిలీజ్ అవుద్ది: స్టార్ హీరో

By:  Tupaki Desk   |   12 Jun 2020 1:00 PM IST
నా సినిమా థియేటర్లోనే రిలీజ్ అవుద్ది: స్టార్ హీరో
X
బాహుబలి తర్వాత రానా హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం "అరణ్య". ప్రభు సాలొమోన్ దర్శకత్వంలో త్రిభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ బాషలలో ఒకేసారి విడుదల కానుంది. అయితే ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన ఈ సినిమా విడుదల తేదీని చిత్రయూనిట్ ఇదివరకే వాయిదా వేయడం జరిగింది. కరోనా ఎఫెక్ట్ ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా విడుదలను నిలిపివేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ భయం భారతదేశ నలుమూలల వణికిస్తుంది. దేశ జనమంతా కరోనా భయంతో ఏ పని చేయలేక పోతున్నారు. అందుకే దేశంలో కరోనా పరిస్థితులు సర్దుమనిగితే ఈ సినిమాను ఏప్రిల్ చివరిలోపు లేదా మే నెలలో రిలీజ్ చేస్తామని చిత్ర దర్శక నిర్మాతలు వెల్లడించారు. అయితే మే నెల కూడా ముగిసి జూన్ కూడా సగం ముగిసింది.

ఇటు చూస్తే ప్రస్తుతం థియేటర్లు తెరచుకొనేలా లేవు. ఇంకా జనాలు కూడా పెద్దగా బయటికి రాట్లేరు. ఇంట్లో నుండే బయటికి రానివాళ్లు ఇంకా థియేటర్ వరకు వచ్చి మా సినిమాను ఏం చూస్తారు అని నిర్మాతలు ఓటిటిల వైపు మొగ్గు చూపుతున్నారట. తాజాగా రానా నటించిన అరణ్య చిత్ర నిర్మాతలు కూడా సినిమాని ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారని టాక్ నడిచింది. అంతేగాక ఇప్పటికే ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ తో భారీ డీల్ కుదుర్చుకున్నారని వార్తలొచ్చాయి. ఎలాగో థియేటర్ల లో రిలీజ్ చేసినా నష్టాలు తప్పేలా లేవు. అందుకే నష్టాల నుండి కొంతైనా ఉపశమనం పొందేందుకు అరణ్య నిర్మాతలు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలని ఆశ్రయిస్తున్నారని వస్తున్న వార్తలపై హీరో రానా స్పందించాడు. అరణ్య సినిమా ఎలాంటి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదల చెయ్యట్లేదు. పరిస్థితులు బాగయ్యాక నేరుగా థియేటర్లోనే విడుదల చేస్తామని బల్లగుద్ది చెప్పాడు. ఇకనైనా పుకార్లకు దూరంగా ఉండండి అని చెప్తున్నాడు. రానా క్లారిటీ ఇవ్వడంతో పుకార్లు సృష్టించే వాళ్లకు సమాధానం దొరికిందని చిత్రయూనిట్ భావిస్తున్నారట.