Begin typing your search above and press return to search.

రానా - మిహీక పెళ్లి పిలుపు క్రియేటివ్ గా

By:  Tupaki Desk   |   24 July 2020 9:45 AM IST
రానా - మిహీక పెళ్లి పిలుపు క్రియేటివ్ గా
X
ఘ‌న‌మైన పెళ్లిళ్ల‌కు ఆస్కారం లేని రోజులివి. మ‌హ‌మ్మారీ విల‌య‌తాండ‌వ‌మాడుతుంటే బ్యాచిల‌ర్స్ అంతా సైలెంట్ అయిపోతున్నారు. జీవితంలో ఒకే ఒక్క సంబ‌ర‌మే అయినా దానిని ఘ‌నంగా జ‌రుపుకోవాన్న ఆలోచ‌న వ‌దిలేసి సింపుల్ గా కానిచ్చేస్తేనే బెట‌ర్ అని ఫిక్స‌యిపోతున్నారు. కొద్దిమంది బంధుమిత్రుల స‌మ‌క్షంలోనే పెళ్లి వేడుక‌లు జ‌రుగుతున్నాయి.

ఇందుకు సెల‌బ్రిటీలు మిన‌హాయింపు ఏమీ కాదు. మొన్న నిఖిల్.. నిన్న నితిన్ ఇదే తీరుగా త‌మ పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నారు. నిఖిల్ ఇప్ప‌టికే పెళ్లాడేశాడు. ఈనెల 26న నితి‌న్ ఓ ఇంటివాడ‌వుతున్నాడు. ఇప్ప‌టికే పెళ్లి ఏర్పాట్లు పూర్త‌య్యాయి. వ‌రుడు నితిన్ .. వ‌ధువు షాలిని కుటుంబాల్లో పెళ్లి సంద‌డికి సంబంధించిన ఫోటోలు ఇప్ప‌టికే రివీల‌య్యాయి.

తాజాగా రానా నుంచి కూడా పెళ్లి వేడుకపై క్లారిటీ వ‌చ్చేసింది. పెళ్లి వేదిక - తేదీ- ముహూర్తానికి సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డ‌య్యాయి. రానా- మిహిక వివాహ పత్రికను అధికారికంగా రిలీజ్ చేశారు. ముఖ్యంగా ఈ ప‌త్రిక డిజైన్ అద్భుతం. పౌరాణిక థీమ్ ని ఆవిష్క‌రిస్తూ.. మాయాబజార్ చిత్రంలోని సన్నివేశాన్ని ఎలివేట్ చేసేలా ఓ వీడియోను రూపొందించారు. ఆగస్టు 08 మధ్యాహ్నం 2 గంటలకు కాజాగూడ‌ చైతన్య ఎన్‌క్లేవ్ (మణికొండ)- హైదరాబాద్ లో ఈ వివాహం జ‌ర‌గ‌నుందని వెల్ల‌డించారు. ఈ వేడుక‌కు కొద్దిమంది బంధుమిత్రులు మాత్ర‌మే హాజ‌రు కానున్నారు.