Begin typing your search above and press return to search.
లెగసీని నడిపించకపోతే చేతకానివాడంటారు!- రానా
By: Tupaki Desk | 2 Jun 2023 10:30 PMతెలుగు చలనచిత్ర పరిశ్రమ సహా అన్ని చిత్ర పరిశ్రమల్లో ప్రబలంగా ఉన్న బంధుప్రీతి గురించి దగ్గుబాటి రానాను ఇటీవలి ఓ ఇంటర్వ్యూల ప్రశ్నించగా అతడు ఆసక్తికరంగా స్పందించాడు. ''వినోద ప్రపంచంలో ఎప్పుడూ ఒక సంస్థాగత ప్రక్రియ అనేది లేదు. ఇది ఎల్లప్పుడూ స్వతంత్ర నిర్మాతలు లేదా ప్రతిభావంతుల సమూహంతో సంస్థలను నిర్మించడం సాధ్యమైంది. సమూహంగా కలిసి పని చేస్తేనే ఏదైనా నిర్మించగలం.
భారతదేశం అంతా ఒకటే.. దేశంలోని పరిశ్రమలన్నీ ఒక్కటిగా పని చేయాలిని మాట్లాడుకుంటున్న ఈ తరుణంలో నిజంగా మరో గొప్ప స్థాయి ఉన్న పరిశ్రమను సృష్టించగల సమయమిదని నేను భావిస్తున్నాను''అని అతను చెప్పాడు.
సినీ కుటుంబాలకు చెందిన వారితో పోలిస్తే.. పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేని ఎవరికైనా ఇక్కడ గేమ్ ఒకేలా సాగుతుందా? అని ప్రశ్నించగా... సినిమా కుటుంబాలు పరిశ్రమతో బాగా కనెక్ట్ అయ్యి ఉన్నాయని దాంతో కచ్చితంగా ప్రయోజనం ఉంటుందని రానా అంగీకరించాడు.
సినిమా కుటుంబాల ప్రపంచంలోని గొప్ప నటులు కాకపోవచ్చు. కానీ వారు గొప్ప ఏజెంట్లు అవుతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ అందరితో పరిచయాలుంటాయి. ఇది ఇతర పరిశ్రమల్లాగే.. తెలిసిన వ్యక్తులతో ముందుకు సాగించే వ్యాపారం ఇది'' అని రానా చెప్పారు.
సినిమా వ్యాపారంలో తరతరాలు గడిపిన కుటుంబాలకు వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత రేపటి తరానికి ఉంటుందని దగ్గుబాటి హీరో ఈ చాటింగ్ సెషన్ లో అన్నారు. కుటుంబంలోని మూడు తరాలు కష్టపడి ఏదైనా నిర్మించినట్లయితే మనం ఆ స్కేల్ లో పనిచేయకపోతే.. కుటుంబంలో పనులు సరిగ్గా చేయని వ్యక్తి అని విమర్శిస్తారు'' అని అన్నాడు.
కొడుకు తండ్రి కంటే మెరుగైన ఫలితాలు తేలేకపోతే చెడ్డవాడు అని.. ఏదీ సాధించలేకపోయాడని అనడం ఇక్కడ చాలా సాధారణం'' అని రానా వ్యాఖ్యానించారు. దగ్గుబాటి హీరో మాటల్లో నిజాయితీ ఈ ఇంటర్వ్యూలో స్పష్ఠంగా కనిపించింది.