Begin typing your search above and press return to search.

చికెన్‌ బిర్యానీ, మటన్‌ హలీమ్‌ మిస్సయ్యాడు

By:  Tupaki Desk   |   14 April 2015 12:00 PM IST
చికెన్‌ బిర్యానీ, మటన్‌ హలీమ్‌ మిస్సయ్యాడు
X
అయ్యో పాపం రానా! అనుకోవాల్సిందే ఈ సంగతి తెలిస్తే. అసలే హైదరాబాదీ కుర్రాడు. పక్కా నాన్‌ వెజిటేరియన్‌. పైగా హైదరాబాద్‌ దమ్‌ బిర్యానీలో మునిగితేలినవాడు. ఈపాటికే బాహుబలునితో ఢీకొట్టే పనిలో సరిసమానంగా బాహుబలం పెంచడానికి మాంసాహారానికి అలవాటు పడిపోయేడాయె. మరి ఇలాంటప్పుడు వెజ్‌ సూప్‌లు, వెజ్‌ సలాడ్‌లు అంటూ కడుపు కట్టేస్తే ఇంకేమన్నా ఉందా? ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు తిని మాంసాహారమును దూరంగా పెట్టు నాయనా! అని ఎవరైనా ఆర్డర్‌ వేస్తే మనసు ఒప్పుకుంటుందా? అస్సలు చాలా కష్టం.

కానీ ఏం చేయగలడు. పాపం అతడు ఒప్పుకోవాల్సొచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాహుబలి కోసం అంత పనీ చేయాల్సొచ్చింది. భళ్లాలదేవ పాత్ర కోసం అంగీకరించాల్సొచ్చింది. పదిరోజులుగా మాంసాహారాన్ని దగ్గరికి రానీయడం లేదు. పూర్తిగా శాఖాహారాన్నే తింటున్నాడు. ప్రయాణాల్లో విమానాశ్రయమలో సైతం వెజ్‌ బర్గర్‌ మాత్రమే తినాల్సొస్తోంది. బెంగళూర్‌ డేస్‌ షూటింగ్‌ నుంచి ఇటు బాహుబలి షూటింగుకి వచ్చేప్పుడు అన్ని రూల్స్‌ పాటించాడు. ఇది తెలిశాక.. పాపం అని ఎవరైనా అనాల్సిందే. అయ్యయ్యో రానా బాబూ.. చికెన్‌ బిర్యానీ, మటన్‌ హలీమ్‌ మిస్సయ్యావ్‌! ప్చ్‌!!