Begin typing your search above and press return to search.

10 నిమిషాలకు 15 లక్షలు

By:  Tupaki Desk   |   22 Sept 2017 11:38 AM IST
10 నిమిషాలకు 15 లక్షలు
X
ప్రస్తుత రోజుల్లో ఎంత పెద్ద బ్రాండ్ కంపెనీ అయినా స్టార్స్ తో ప్రచారాన్ని చేయాల్సిందే అంటోంది. ఒకేసారి వారితో బేరాన్నికుదుర్చుకొని ఏళ్ల తరబడి బ్రాండ్ అంబాసిడర్ గా నియమంచుకుంటున్నారు. ఇక తారలు కూడా అందుకు ఒకే అంటూ.. సినిమాల్లో సంపాదించిన దానికంటే ఇతర ప్రచార కార్యక్రమాల్లోనే ఎక్కువగా సంపాదిస్తున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్స్ ఎక్కువగా ఈ తరహాలో డబ్బు సంపాదించేవారు. ఇప్పుడు సౌత్ లో టాలీవుడ్ స్టార్స్ కూడా అదే బాటలో నడుస్తున్నారు.

ముఖ్యంగా రానా ప్రస్తుతం సినిమాలకన్నా యాడ్స్ రూపంలోనే ఎక్కువగా సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక షాప్ ఓపెనింగ్స్ కి అయితే రానా ఎవరు ఊహించని విధమైన రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేస్తున్నాడట. దాదాపు 15 లక్షలవరకు రానా అడుగుతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఓ ప్రముఖ మాల్ ఓపెనింగ్ కి వెళ్లిన రానా అక్కడ 10 నిముషాలు మాత్రమే ఉన్నాడు. రిబ్బన్ కటింగ్ చేసి కొంచెం సేపు ఉండి వెళ్ళిపోయాడు. అందుకు రానా 15 లక్షలను అందుకోవడం చాలా గొప్పే అని చెప్పాలి.

బాహుబలి తర్వాత చాలా ఆదరణను దక్కించుకున్నాడు రానా. అలాగే ఘాజి సినిమాతో తనకంటూ మంచి మార్కెట్ ను సెట్ చేసుకొని నేనే రాజు నేనే మంత్రి తో పర్వాలేదనిపించారు. వినూత్న శైలిలో సినిమాలను తీస్తుండడంతో రానా మంచి ఫాలోవర్స్ ని సంపాదించుకుంటున్నాడు. దీంతో అతనికి యాడ్స్ రూపంలో ఇలా షాప్ ఓపెనింగ్స్ వల్ల లెక్క బాగానే ఆందుతుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రానా 1945 అనే సినిమాలో నటిస్తున్నాడు.