Begin typing your search above and press return to search.

2020పై షాకిస్తున్న‌ మిహీక ఒపీనియ‌న్

By:  Tupaki Desk   |   3 Jan 2021 5:56 AM GMT
2020పై షాకిస్తున్న‌ మిహీక ఒపీనియ‌న్
X
2020 చాలా మందికి పీడ‌క‌ల‌ల్ని ప‌రిచ‌యం చేసిన బ్యాడ్ ఇయ‌ర్ గా రికార్డుల‌కెక్కింది. ముఖ్యంగా వినోద ప‌రిశ్ర‌మ‌ల‌కు తీవ్ర న‌ష్టాన్ని క‌ల‌గ‌జేసింది. సేమ్ టైమ్ క‌రోనా మ‌హ‌మ్మారీ వ‌ల్ల ఈ భూమండ‌లానికి ఎంతో మేలు కూడా జ‌రిగింది. నెగెటివిటీ ఎంత ఉందో పాజిటివిటీని కూడా అంతే ఎక్కువ‌గా ప‌రిచ‌యం చేసింద‌నేది చాలామంది అభిప్రాయం.

ఇప్పుడు ఆ రెండో సెక్ష‌న్ లోనే మిహీక చేరారు. 2020 ని ఉత్తమ సంవత్సరంగా ప్ర‌క‌టించారు. రానా- మిహీక‌ గత ఏడాది వివాహం చేసుకున్నారు. మహమ్మారి కారణంగా ప్రపంచం గడిచిన సంవత్సరం చెత్త దశ అని భావించింది. కానీ రానా -మిహీకాలకు 2020 ఎంతో మనోహరమైన ఏడాది. తీపి గుర్తుల్ని అందించిన సంవ‌త్స‌రంగా నిలిచింది.

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇన్ స్టాగ్రామ్ ‌లోకి మిహీక ఒక వ్యాఖ్య‌ను జోడించారు. 2020 తన జీవితంలో ఉత్తమ సంవత్సరమని .. భర్త రానా దగ్గుబాటి కారణంగా ది బెస్ట్ ఇయ‌ర్ గా మారింద‌ని అన్నారు.

``జనాదరణ పొందిన అభిప్రాయాలకు విరుద్ధంగా 2020 నా జీవితంలో ఉత్తమ సంవత్సరం! థాంక్యూ .. రానా ద‌గ్గుబాటి.. మై ల‌వ్! ఇక్కడ నుండి పైపైకి ఎద‌గాలి`` అని వ్యాఖ్య‌ను జోడించారు. రానా - మిహీక 2020 ఆగస్టులో ప్రేమాయ‌ణంపై ఓపెన‌ప్ అయ్యారు. పెళ్లి సంగ‌తి ప్ర‌క‌టించి అనంతరం ఒక‌ట‌య్యారు. ఈ యువ జంట హైదరాబాద్ లోని వారి నివాసంలో నూతన సంవత్సరాన్ని జరుపుకున్నారు.