Begin typing your search above and press return to search.
క్షుద్ర పూజలు - చేతబడులు నేపథ్యంలో హ్యాండ్సమ్ హంక్ సినిమా..!
By: Tupaki Desk | 10 Nov 2020 2:00 PM ISTటాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ దగ్గుబాటి రానా తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా వరుస విజయాలను అందుకుంటూ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన చిత్రాలు విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. 'బాహుబలి' సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న రానా.. లేటెస్టుగా మరో త్రిభాషా చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. హారర్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి మిలింద్ రౌ దర్శకత్వం వహించనున్నారు. మణిరత్నం దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన మిలింద్.. సిద్దార్థ్ హీరోగా వచ్చిన హారర్ థ్రిల్లర్ 'గృహం' తో సూపర్ హిట్ అందుకున్నాడు. అలానే నయనతార ప్రధాన పాత్రలో 'నెట్రికన్' అనే మిస్టరీ థ్రిల్లర్ ని డైరెక్ట్ చేశాడు. ఈ క్రమంలో రానా తో ఓ వైవిధ్యమైన సినిమా చేయడానికి స్టోరీ రెడీ చేసుకున్నాడు.
కాగా, రానా - మిలింద్ కాంబోలో రాబోతున్న సినిమా క్షుద్ర పూజలు - చేతబడి నేపథ్యంలో ఉండబోతోందని సమాచారం. తెలుగుతో పాటు తమిళ్ హిందీ భాషలో రూపొందనున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్ పై ఆచంట గోపీనాథ్ నిర్మించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు నుంచే ప్రారంభించాలని అనుకున్నప్పటికీ కరోనా కారణంగా కుదరలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూట్ వచ్చే ఏడాది జనవరి నుంచి స్టార్ట్ కానుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా రానా నటించిన త్రిభాషా చిత్రం 'అరణ్య' విడుదలకు సిద్ధంగా ఉంది. నేషనల్ అవార్డ్ గ్రహీత ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అలానే వేణు ఉడుగుల దర్శకత్వంలో 'విరాట పర్వం' అనే సోషల్ డ్రామాలో నటిస్తున్నాడు. అంతేకాక గుణశేఖర్ దర్శకత్వంలో 'హిరణ్యకశ్యప' అనే భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ కి కూడా రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.