Begin typing your search above and press return to search.

నేషనల్ ఇమేజ్ పై కన్నేసిన రాణా

By:  Tupaki Desk   |   17 Aug 2015 3:30 PM IST
నేషనల్ ఇమేజ్ పై కన్నేసిన రాణా
X
ఇప్పుడు దేశవ్యాప్తంగా రాణా పేరు మారుమోగిపోతోంది. ప్రస్తుతం నార్త్ లో అంతో ఇంతో పేరున్న రాణాకు.. బాహుబలి రిలీజయ్యాక. భల్లాలదేవ కేరక్టర్ తో... మనోడి రేంజ్ ఓ స్థాయికి వెళ్లిపోయింది. దీంతో దేశవ్యాప్తంగా తన పేరును సుస్థిరం చేసుకునేలా ప్లాన్స్ వేసుకుంటున్నాడు ఈ ఆజానుబాహుడు. బాహుబలి 2 ని ఇంకా పూర్తిచేయాల్సి ఉంది. నిజానికి మొదటి పార్ట్ తోనే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేయాల్సి ఉన్నా... గాయాల కారణంగా 3-4 నెలలు లేటైందట.

మొదట తన మోకాలికి గాయమై కొంత ఆలస్యమయితే.. తర్వాత బాహుబలి హీరో ప్రభాస్ భుజం గాయంతో మరింత లేట్ అయిందని చెప్పాడు రాణా. దీంతో ఇంకా షూటింగ్ కంప్లీట్ చేయాల్సి ఉందట. అక్టోబర్ లో సెట్స్ మీదకు వెళ్లి ముందుగా బాహుబలిని పూర్తి చేయనున్నట్లు చెప్పాడు. ఇంకా గ్రాఫిక్ వర్క్ చాలా చేయాల్సి ఉండడంతో.. వచ్చే సమ్మర్ రిలీజ్ డేట్ ఖాయం కాలేదని తేల్చేశాడు. అయితే... ఈ మూవీ తర్వాత తెలుగు, తమిళ్, హిందీ త్రిభాషా చిత్రంలో నటించనున్నాడు రాణా.

ఆ తర్వాత తన తొలి మూవీ లీడర్ కు సీక్వెల్ చేసేందుకు సిద్ధం కాబోతున్నాడు. ఇప్పటికే డైరెక్టర్ చెప్పిన లైన్ కు ఓకే అన్నాడు కూడా. ఇది కూడా హిందీలో డబ్ చేయబోతున్నారు. ప్రస్తుతానికి మరో ఏడాదిన్నరపాటు రాణా షెడ్యూల్ ఖాళీ లేదు. ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయ్యాక... రాణా స్థాయి మరింతగా పెరుగుతుందనడంలో సందేహం అక్కర్లేదు.. ఇక రాణా నేషనల్ స్టార్ అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయట.