Begin typing your search above and press return to search.

సమంతా బాడీ గార్డ్ గా భల్లాలదేవా తమ్ముడు

By:  Tupaki Desk   |   10 July 2019 11:19 AM IST
సమంతా బాడీ గార్డ్ గా భల్లాలదేవా తమ్ముడు
X
ఆ మధ్య ఏదో వివాదంలో పేరు బయటికి రావడమే తప్ప దగ్గుబాటి సురేష్ చిన్న కొడుకు అలియాస్ రానా తమ్ముడు అభిరాం బయట కనిపించేది చాలా తక్కువ. సురేష్ సంస్థలో కొన్ని కీలక బాధ్యతలు నెరవేరుస్తున్నప్పటికీ నాన్న తాలూకు సినిమా ఈవెంట్స్ లో అరుదుగా దర్శనమిస్తాడు. అయితే ఓ బేబీ విడుదలయ్యాక సమంతాకు అచ్చం బౌన్సర్ తరహాలో వెన్నంటే ఉంటూ తన బాధ్యతలు చూసుకుంటున్నాడు. విడుదల రోజే జరిగిన సక్సెస్ ట్రీట్ లో అభిరాం ఉత్సాహంగా సామ్ పక్కనే ఉండి అన్ని చూసుకోవడం మీడియా దృష్టి దాటిపోలేదు.

ఎన్నడూ లేనిది అభిరాం ఇలా స్పెషల్ ఇంటరెస్ట్ తీసుకోవడం పట్ల అందరూ ఆశ్చర్యపోయారు కూడా. యూనిట్ తో తప్ప ఎవరితో మాట్లాడని అభిరాం మొత్తానికి ఇప్పుడు అందరి దృష్టిలో పడ్డాడు. ఓ బేబీ నిర్మాణ సంస్థల్లో సురేష్ ఒకటి కావడం సమంతా స్వయానా నాగ చైతన్య సతీమణి కావడం లాంటి కారణాలు అభిరాం ఇంత కేర్ తీసుకోవడానికి దోహదం చేశాయి అనుకోవచ్చు.

ఓ బేబీ ఇప్పటికే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. దాన్ని బ్లాక్ బస్టర్ గా మార్చే టార్గెట్ తో కాళ్లకు చక్రాలు కట్టుకుని సమంతా థియేటర్లకు కూడా నేరుగా వెళ్తోంది. ఇక్కడా కూడా అభిరామే అంతా తానై వ్యవహారించడం గమనార్హం. తను వస్తున్నాడనే సమంత కూడా ధైర్యంగా సినిమా హాళ్లకు వెళ్తోందని లేకపోతే కేవలం బౌన్సర్ల సపోర్ట్ తో మేనేజ్ చేయడం కష్టమనే కష్టమనే అభిప్రాయంతో సామ్ ఉందట.