Begin typing your search above and press return to search.

రానా `స‌మాన‌త్వం` పాల‌సీకి ఫిదా అయిపోయా

By:  Tupaki Desk   |   13 Dec 2020 3:00 PM IST
రానా `స‌మాన‌త్వం` పాల‌సీకి ఫిదా అయిపోయా
X
మేల్ డామినేటెడ్ ఇండ‌స్ట్రీలో ఫెమినిస్టుల మ‌నుగ‌డ అన్న‌ది అంత సులువేమీ కాదు. ఇక ఫెమినిజం భావ‌జాలం ఉన్న క‌థ‌నాయిక‌లు నాయికా ప్రాధాన్య‌త గురించి ఆలోచిస్తారు. ముక్కు సూటిగా ఉండే నాయిక‌లు సైతం పూర్తిగా హీరోకి ఒదిగి ఉండే పాత్ర‌ల్ని ఎంపిక చేసుకునేందుకు ఆస‌క్తిగా ఉండ‌రు. ప‌రిశ్ర‌మ‌ను ప‌రిశీలిస్తే ఇదే అవ‌గ‌త‌మ‌వుతుంది కూడా.

ఇక అంద‌రిలాగా రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ నాయిక‌గా న‌టించేందుకు సాయి ప‌ల్ల‌వి విరుద్ధం. తొలి నుంచి త‌న‌కంటూ ఒక పంథా ఉంద‌ని నిరూపించింది ఈ యువ‌నటి. కమర్షియల్ చిత్రాలలో స్టార్ హీరోల సరసన పాత్రలను ఎంచుకోని రేర్ సౌత్ నాయిక‌గా సాయి పల్లవి పాపుల‌రైంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ రానా స‌ర‌స‌న వేణు వేణు ఉడుగుల దర్శకత్వంలోని విరాఠ‌ప‌ర్వం చిత్రంలో న‌టిస్తోంది. ఇది రొమాంటిక్ యాక్షన్ డ్రామా క‌థాంశంతో రూపొందుతోంది.

ఎప్ప‌టిలానే ఇందులోనూ సాయి పల్లవి పాత్ర‌కు ప్రాధాన్య‌త ఎక్కువే. ఇక త‌న పాత్ర తీరుతెన్నుల‌కు త‌గ్గ‌ట్టే త‌న‌కు రానా అత్యంత గౌర‌వం ఇచ్చార‌ని ప్ర‌చారంలో ప్రాధాన్య‌తను ఇచ్చార‌ని ప్ర‌శంస‌లు కురిపించింది. రానా సమానత్వాన్ని విశ్వసించే వ్యక్తి అని ఆమె చెప్పింది. ``సాధారణంగా స్త్రీకి పెద్ద పాత్ర ఉంటే.. వేసే పోస్టర్లలో మాత్రం హీరోనే హైలైట్ అవుతాడు. కానీ విరాఠ‌ప‌ర్వం టైటిల్ కార్డుల్లో నా పేరు తన కంటే ముందుగానే ఉండాలని రానా నాకు చెప్పారు. ఎందుకంటే నేను ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాను. రానా సమానత్వాన్ని నమ్ముతారు. అతనితో పనిచేయడం ఒక బ్లెస్సింగ్`` అని సాయి ప‌ల్ల‌వి అంది. విరాటపర్వం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసి సాధ్య‌మైనంత తొంద‌ర్లో రిలీజ్ చేసేందుకు చిత్ర‌బృందం ప్లాన్ చేస్తోంది.