Begin typing your search above and press return to search.

నీ సబ్ మెరైన్ ముంచెయ్‌ రానా

By:  Tupaki Desk   |   4 Feb 2016 7:37 AM GMT
నీ సబ్ మెరైన్ ముంచెయ్‌ రానా
X
యంగ్ హీరో దగ్గుబాటి రాణా ప్రస్తుతం ఘాజీ అనే పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. దేశంలో తొలిసారిగా సబ్ మెరైన్ కాన్సెప్ట్ తో వస్తున్న మూవీ ఇది. 45 ఏళ్ల క్రితం ఇండియా పాక్ వార్ సందర్భంగా మునిగిపోయిన సబ్ మెరైన్ కథే.. ఈ ఘాజీ సినిమా. ఇందుకో హైద్రాబాద్ ట్యాంక్ బండ్ లో భారీ సబ్ మెరైన్ సెట్ కూడా వేశారు. ఇది రాణా చేస్తున్న సినిమా సంగతి అయితే.. ఇప్పుడు రాణాకు సబ్ మెరైన్ ముంచాల్సిన టైం వచ్చిందనే సలహా ఇచ్చాడు ఓ బాలీవుడ్ హీరో.

రితేష్ దేశ్ ముఖ్ - జెనీలియాల మ్యారేజ్ జరిగి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ భారీ పార్టీ ఏర్పాటు చేశాడు బాలీవుడ్ స్టార్. ఈ ఈవెంట్ కి రాణా కూడా అటెండ్ అయ్యాడు. అందరితో పాటు రాణా కూడా విష్ చేశాక.. మైండ్ బ్లాంక్ అయ్యే కామెంట్ చేశాడు రితేష్. 'థాంక్యూ బ్రదర్ - బ్యాచిలర్ గా నీ సబ్ మెరైన్ ని ముంచాల్సిన టైం వచ్చింది' అన్నాడు జెన్నీ భర్త. అఫ్ కోర్స్.. ఈ బాలీవుడ్ హీరో ఈ మధ్య వరుసగా అడల్ట్ కంటెంట్ సినిమాలు చేస్తున్నాడు కదా.. అందుకే ఇలా అడల్ట్ జోక్ వేసేశాడు రాణాపై. వీళ్లంతా మంచి ఫ్రెండ్స్ కూడా కావడంతో.. రాణా కూడా స్పోర్టివ్ గానే తీసుకున్నాడులెండి.

అయితే.. ప్రస్తుతం రాణా మ్యారేజ్ పై టాలీవుడ్ లో కూడా హాట్ హాట్ డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడీ మాటలు బాలీవుడ్ వరకూ పాకాయన్న మాట. మారి రితేష్ దేశ్ ముఖ్ సలహా విని.. సబ్మెరైన్ ముంచే పని రాణా ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో!