Begin typing your search above and press return to search.

వెంకీ-రానా అలా చేస్తున్నారట

By:  Tupaki Desk   |   25 Dec 2017 6:00 PM IST
వెంకీ-రానా అలా చేస్తున్నారట
X
టాలీవుడ్ లో మల్టీస్టారర్ కథలతో మెప్పించే విక్టరీ వెంకటేష్ ప్రయోగాత్మకమైన కథలను చేసి చాలా మెప్పిస్తుంటాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే గత కొంత కాలంగా ఈ హీరో ఎక్కువగా విజయాలను అందుకోవడం లేదు. చివరగా గురు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా వెంకీకి ఏ మాత్రం లాభం చేకూర్చలేదు. అయినా కూడా విక్టరీ హీరో ప్రయోగాలకు ఏ మాత్రం నో చెప్పడం లేదు.

అసలు మ్యాటర్ ఏంటంటే.. వెంకటేష్ ఒక వెబ్ సిరీస్ లో నటించడానికి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో స్పెషల్ ఏమిటంటే.. రానా కూడా బాబాయ్ తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడట. మొన్నటివరకు ఇద్దరూ కలిసి సినిమాలను చేస్తున్నారు అనే వార్తలు చాలా వచ్చాయి. కానీ ఫైనల్ గా వెబ్ సిరీస్ ద్వారానే ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారట. వెబ్ సిరీస్ కథ రాజీవ్ గాంధీ జీవిత ఆధారంగా ఉండబోతోందని సమాచారం. మల్టిపుల్ లాంగ్వేజ్ లలో ఆ వెబ్ సిరీస్ ఉండనుంది. ఏఎమ్ ఆర్.రమేష్ దర్శకత్వంలో రాబోతోన్న ఆ వెబ్ సిరీస్ త్వరలోనే స్టార్ట్ చేయనున్నారట.

అయితే ఇంతకుముందే రానా వెబ్ సిరీస్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. మంచి ఆదరణ కూడా దక్కింది. అయితే వెంకీ కూడా రానాతో కలిసి ఒక మంచి ప్రయోగం చేయడానికి డిసైడ్ అవుతున్నాడాట. ప్రస్తుతం వెంకీ తేజ దర్శకత్వంలో ఒక సినిమాను చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక రానా 1940 అనే కథతో చాలా బిజీగా ఉన్నాడు. మరి ఆ వెబ్ సిరీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.