Begin typing your search above and press return to search.

'సలార్‌' రేంజ్‌ ను మరింత పెంచే ఆ ఇద్దరు

By:  Tupaki Desk   |   12 Dec 2020 3:30 AM GMT
సలార్‌ రేంజ్‌ ను మరింత పెంచే ఆ ఇద్దరు
X
ఆల్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ ప్రభాస్‌.. పాన్‌ ఇండియా స్టార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్ ల కాంబో మూవీ 'సలార్‌' అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుండి సినిమా గురించిన ముచ్చట్లు గల్లీ నుండి నేషనల్ లెవల్‌ లో వినిపిస్తూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా సలార్‌ గురించిన చర్చలు జరుగుతున్నాయి. కేజీఎఫ్‌ 2 షూటింగ్‌ పూర్తి అవ్వడమే ఆలస్యం వెంటనే సలార్‌ ను మొదలు పెట్టబోతున్నట్లుగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్ ప్రకటించాడు. వీరిద్దరి కాంబో మూవీ అంటే కేజీఎఫ్‌ కు రెండు మూడు రెట్ల అధిక యాక్షన్‌ ఉంటుందని ఖచ్చితంగా ఒక విజువల్‌ ట్రీట్‌ ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ఈ సినిమాలో నటించేందుకు గాను నటీనటుల కోసం దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ అన్ని వయసుల వారిని ఆడిషన్స్‌ కోసం పిలిచాడు. ఈనెల 15వ తారీకున అల్యూమీనియం ఫ్యాక్టరీలో ఆడిషన్స్‌ జరుగబోతున్నాయి. కొత్త వారితో పాటు మరికొంత మంది స్టార్స్ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారు అనే ప్రచారం జాతీయ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్రల కోసం టాలీవుడ్‌ యంగ్‌ హల్క్‌ రానా మరియు మలయాళ సీనియర్‌ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ లను ఎంపిక చేశారనే ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే బాహుబలి సినిమాలో ప్రభాస్‌ మరియు రానా కలిసి నటించారు. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరు సాహోలో నటించబోతున్నారు అన్నారు.. రాధేశ్యామ్‌ లో రానా కీలక పాత్ర అన్నారు. కాని అవన్నీ ఒట్టి పుకార్లే అయ్యాయి. ఇప్పుడు సలార్‌ మూవీలో రానా అంటున్నారు. ఈసారి ఎంత వరకు నిజం అనేది చూడాలి. మరో వైపు మోహన్‌ లాల్‌ విషయంలో కూడా ప్రముఖంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వేళ వీరిద్దరు కనుక ఖచ్చితంగా సలార్‌ లో ఉంటే సినిమా స్థాయి అమాంతం పెరగడం ఖాయం.