Begin typing your search above and press return to search.

నేడే రానా - మిహీకాల ఎంగేజ్మెంట్...!

By:  Tupaki Desk   |   20 May 2020 5:45 AM GMT
నేడే రానా - మిహీకాల ఎంగేజ్మెంట్...!
X
టాలీవుడ్‌ లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ గా ఉన్న ద‌గ్గుబాటి రానా ఇటీవ‌ల మిహీకా బ‌జాజ్ త‌న ప్రేమ‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని చెప్పి అంద‌రికి షాక్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. రానా ఓ ఇంటివాడు కాబోతుండటంతో సినీ ప్రముఖులు.. అభిమానులందరూ ఆనందంతో ఉన్నారు. వీరి పెళ్ళికి ఇరు కుటుంబాలు ఓకే చెప్పేశారు. రానా - మిహిక బజాజ్ వివాహం ఈ ఏడాదిలోనే ఉంటుందని కుటుంబ సభ్యులు కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఇద్ద‌రు ఒక‌రినొక‌రు అర్ధం చేసుకొని పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌మ‌య్యారని.. ఇప్పటి నుండే పెళ్లి పనులు మొదలు పెట్టాలని భావిస్తున్నామని.. డిసెంబర్ కు ముందే పెళ్లి ఉండే అవకాశముందని.. వారిద్దరూ జీవితంలో ఒకటి కావాలనుకోవడం సంతోషమని రానా తండ్రి సురేష్ బాబు వెల్లడించారు. అయితే ఇప్పుడు ఎవరూ ఊహించని రీతిలో అందరికి మరో బిగ్‌ సర్‌ ప్రైజ్ ఇచ్చింది దగ్గుబాటి ఫ్యామిలీ. రానా - మిహీకా బజాజ్‌ల నిశ్చితార్థ ముహూర్తం నిర్ణయించేసారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు రామానాయుడు స్టూడియోలో రానా - మిహిక బజాజ్ ఎంగేజ్ మెంట్ జరగబోతుంది. సైలెంట్‌ గా తనకు కాబోయే భార్యను వెతుక్కున్న రానా.. అదేవిధంగా వెంటనే ఎంగేజ్మెంట్ కూడా ప్లాన్ చేసుకున్నాడు.

కాగా హైదరాబాద్ లో పుట్టి పెరిగిన మిహీక బజాజ్.. బంటీ - సురేష్ బజాజ్ దంపతుల కుమార్తె. చెల్సియా విశ్వవిద్యాలయం నుండి ఇంటీరియర్ డిజైన్ లో మాస్టర్స్ డిగ్రీ పొందింది. ఆమె ప్రస్తుతం ముంబైలో డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియోను స్వయంగా నడుపుతున్నారు. పెళ్లి ఎప్పుడు అని అడిగిన ప్రతిసారి ఇప్పుడు కాదని దాటవేస్తూ వచ్చిన రానా.. ఉన్నట్లుండి కాబోయే భార్యను పరిచయం చేసాడు. అలానే ఇప్పుడు ఎంగేజ్మెంట్ కూడా సడన్ గా ఫిక్స్ చేసుకున్నాడు. మరి పెళ్లి డేట్ కూడా సడెన్ గా ఫైనలైజ్ చేసి అందరికి షాక్ ఇస్తాడేమో. కాగా అధికారిక సూచనలు పాటిస్తూ కొంతమంది సన్నిహితులు వధూవరుల కుటుంబ సభ్యులు మాత్రమే ఈ ఎంగేజ్‌ మెంట్‌ కి హాజరు కాబోతున్నారని సమాచారం.