Begin typing your search above and press return to search.
కాజల్ దిష్టి తీస్తోందట
By: Tupaki Desk | 10 Aug 2017 12:47 PM ISTతెలుగులో ఇప్పుడు ప్రచారాల హోరు కొత్తపుంతలు తొక్కుతుంది. పోస్టర్ని విడుదల చేయడంలో కానీ ఈ సినిమాలోని పాటలు విడుదల చేయడంలో కానీ లేదుoటే ఆ సినిమా కథ ప్రకారం ఆ స్టార్ హీరోలు హీరోయిన్లు కలిసి మీడియా ముందు రావడం కానీ కొత్తగా ఉండేలా చూసుకుంటున్నారు. హీరో రానా ఇప్పుడు రేపు విడుదల కాబోతున్న నేనే రాజు నేనే మంత్రి పోలిటికల్ థ్రిల్లర్ సినిమా ప్రచారం కూడా కొత్తగా చేసి జనాలకు దగ్గర చేసే ప్రయత్నం విజయవంతంగా పూర్తి చేశాడు.
ఈ సినిమా ప్రచారం మొత్తం రానానే చేసిన మొదట ఈ సినిమాకు క్రేజ్ రావడం మొదలైంది మాత్రం రానా తొలిసారిగా కాజల్ అగర్వాల్ తో జత కడుతున్నాడు అనే వార్త తోనే. వీళ్ళ ఇద్దరి మధ్య కెమిస్త్రీ కూడా అంతే పాపులర్ అయ్యింది. కాజల్ తన అందాలను రానాతో కలిసి చక్కగానే పండించింది. వీళ్ళ ఇద్దరి మధ్య ఉండే రొమాన్స్ ఈ సినిమాకు ప్లస్ అవుతుంది అని చెబుతున్నారు నేనే రాజు నేనే మంత్రి సినిమా యూనిట్. కాజల్ ఇప్పుడు రానా అంటే నాకు మంచి ఫ్రెండ్ అని మీడియా ముందు తెగ పొగిడేస్తుంది. మాటలలోనే కాదు చేతలలోనూ చూపిస్తోంది తనకు రానా అంటే ఎంత అభిమానమో. ఈ సినిమా ప్రచారం కోసం ఒకసారి మీడియా ముందుకు వచ్చినప్పుడు నా రాజు కి అందరూ దిష్టి పెడుతున్నారు అని చెబుతుంది. అలా చెప్పి ఇలా దిష్టి కూడా తీసేసింది మీడియా ముందు. రానా కూడా ఈ సినిమా ప్రచారం మొత్తం తెల్ల చొక్కా తెల్ల పంచెతోనే చేశాడు. ఇప్పుడు ఇక్కడ కూడా తెల్ల పంచె ను పైకి కట్టి హాట్ గా ఉన్నాడు. నా హీరో పై అందరూ ఎక్కువగా దృష్టి పెట్టి దిష్టి పెడుతున్నారు అని భావించి ఇలా చేస్తుంది.
రానా ఈ సినిమాలో జోగేంద్ర అనే యువ రాజకీయ నాయకుడు గా కనిపిస్తున్నాడు. రానా ప్రేయసిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇప్పుడు తెలుగులో హాట్ స్క్రీన్ కపుల్గా వీళ్ళు మంచి క్రేజ్ ని తెచ్చుకున్నారు. ట్రైలర్ పోస్టర్ ప్రచారం అన్నీ బాగానే ఉన్నాయి మరి సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. తేజ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సురేశ్ బాబు నిర్మాతగా చేశారు. ఈ సినిమా రేపు ఆగష్టు 11 నాడు విడుదలకాబోతుంది.