Begin typing your search above and press return to search.

కాజల్ తో టూర్ .. రానాకి కోపమొచ్చింది

By:  Tupaki Desk   |   8 July 2017 4:57 PM IST
కాజల్ తో  టూర్ .. రానాకి కోపమొచ్చింది
X
దగ్గుబాటి రానా హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ నేనే రాజు నేనే మంత్రి విడుదలకు సిద్ధమవుతోంది. బాహుబలి సిరీస్ తో వచ్చిన రానా క్రేజ్ ను బేస్ చేసుకుని.. సౌత్ అంతా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్ విషయంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు రానా. తాను పబ్లిసిటీ యాక్టివిటీస్ లో పాల్గొనబోనని దర్శకుడు తేజ ముందే చెప్పాడట. అందుకే రానా అంతా తన భుజాలపై వేసుకున్నాడు.

తెలుగు.. తమిళ్.. మలయాళ వెర్షన్లకు తగినంతగా ప్రాధాన్యం ఇస్తూ అన్ని చోట్లా ప్రచారం చేయనున్నారు. సౌత్ అంతా బోలెడంత క్రేజ్ ఉన్న కాజల్ అగర్వాల్ ను స్పెషల్ గా రిక్వెస్ట్ చేశాడట. అయితే.. ఇప్పుడు దక్షిణాది మొత్తం రానా- కాజల్ కలిసి ప్రచారం చేయాల్సి ఉందన్న మాట. ఈ పాయింట్ నే బేస్ చేసుకుని.. రానాతో కాజల్ చక్కర్లు అంటూ రూమర్లు వచ్చేశాయి. రీసెంట్ గా ఓ ఈవెంట్ త్రిష పక్కనే రానా కూర్చోవడాన్ని మీడియా నానా యాగీ చేసింది. మళ్ళీ వీళ్ల మధ్యన ఏదో నడుస్తోంది అంటూ టాక్ పుట్టించేశారు. అప్పుడే హర్ట్ అయిన రానా.. ఇప్పుడు కాజల్ విషయంలో కూడా రూమర్స్ వస్తుండడంపై కాసింత సీరియస్ అవుతున్నాడట.

కాజల్ ఎక్కువగా ప్రమోషన్స్ చేయదు అంటూ వస్తున్న వార్తలు కూడా రానాను కాస్త ఇబ్బంది పెట్టేస్తున్నాయి. ఎందుకంటే తను ఐటెం సాంగ్ మాత్రమే చేసినా.. జనతా గ్యారేజ్ కు సోషల్ మీడియా ద్వారా పిచ్చ పబ్లిసిటీ చేసింది కాజల్. కాబట్టి ఇప్పుడు మెయిన్ హీరోయిన్ గా.. అది కూడా అద్భుతమైన కెమిస్ర్టీ పండించిన పాత్ర కోసం.. ప్రమోషన్ ఎందుకు చేయదు అనేది రానా వాదన.