Begin typing your search above and press return to search.

బాహుబలి కోసం మొత్తం ఏడేళ్లట

By:  Tupaki Desk   |   29 Jan 2017 4:46 PM IST
బాహుబలి కోసం మొత్తం ఏడేళ్లట
X
‘బాహుబలి’ 2013లో మొదలైంది. దీని రెండో భాగం 2017లో విడుదలవుతోంది. ఐతే రానా దగ్గుబాటి మాత్రం ఈ సినిమా కోసం మొత్తం ఏడేళ్లు వెచ్చించినట్లు చెబుతున్నాడు. ‘బాహుబలి’ సినిమా పట్టాలెక్కడానికి రెండు మూడేళ్ల ముందే ఈ సినిమా కథ తన దగ్గరికి వచ్చిందని.. ఒక్కసారి సినిమా చేయాలని ఫిక్సవగానే దాని కోసం సన్నద్ధమవడం మొదలుపెట్టానని.. అలా మొత్తంగా ఈ సినిమాతో తన ప్రయాణం ఏడేళ్లు సాగినట్లు అవుతుందని రానా తెలిపాడు. మరి ఒక్క ప్రాజెక్టు కోసం ఇంత సమయం వెచ్చించడం సమంజసమేనా అని రానాను అడిగితే అతను ఏమని సమాధానం ఇచ్చాడంటే..

‘‘బాహుబలి రెండు భాగాల కోసం మొత్తం ఏడేళ్లు పడుతోంది. మన కెరీర్ పీక్స్ లో ఉండేది 14-15 ఏళ్లు అనుకుంటే.. నా కెరీర్‌ లో సగ భాగం ఈ సినిమాకే కేటాయించానన్నమాట. ఏ నటుడికైనా ఇది విలువైన సమయం. ఈ సినిమా వల్ల నేను ఎక్కువ సినిమాలు చేయలేకపోయానన్నది నిజం. కానీ తప్పలేదు. జాతీయ స్థాయిలో పేరుతెచ్చుకున్న ‘బాహుబలి’ సినిమా చేస్తున్నప్పుడు ఒకటి అర్థమైపోయింది. ఇలాంటి సినిమాను ఇప్పటికైతే ఎవరు చేయలేదు. ఈ సినిమా కోసం పెట్టే సమయంలో నేను చేసే నాలుగైదు సినిమాల కంటే.. దీని ద్వారా వచ్చే పేరు ఎక్కువనిపించింది. ఆ సంతృప్తే నాతో పాటు అందరినీ ముందుకు నడిపించింది. ‘బాహుబలి’ సాధించిన విజయం కంటే.. అలాంటి అద్భుతమైన చిత్రం కోసం పని చేస్తున్నపుడు కలిగిన అనుభవం.. ఎన్నో పాఠాలు నేర్పింది. ఎంతో సంతోషాన్ని కలిగించింది’’ అని రానా తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/