Begin typing your search above and press return to search.

ఫ‌స్ట్ లుక్‌: జ‌య‌ల‌లిత‌గా ర‌మ్య కృష్ణ‌

By:  Tupaki Desk   |   7 Sep 2019 9:05 AM GMT
ఫ‌స్ట్ లుక్‌: జ‌య‌ల‌లిత‌గా ర‌మ్య కృష్ణ‌
X
వెబ్ సిరీస్ ట్రెండ్ న‌డుస్తోందిప్పుడు. ఓటీటీ (OTT) వేదిక రంగ‌ ప్ర‌వేశంతో వినోదం తీరుతెన్నులు అనూహ్యంగా మారిపోయింది. సినిమాల్ని మించి వెబ్ సిరీస్ ల‌కు ఆద‌ర‌ణ పెరుగుతోంది. అర‌చేతిలో ఇమిడిపోయే మొబైల్ వినోద సాధ‌నంగా మారిపోవ‌డంతో ఈ వేదిక‌కు అసాధార‌ణ గుర్తింపు ద‌క్కింది. వెండితె-బుల్లితెర‌కు ధీటుగా న‌టీన‌టుల‌కు ఛాన్సులు పెరుగుతున్నాయి. ఈ సద‌వ‌కాశాన్ని విడిచిపెట్టేందుకు అగ్ర‌హీరోలు- టాప్ హీరోయిన్లు సైతం సిద్దంగా లేరు. బాలీవుడ్ సహా సౌత్ లోనూ అగ్ర తార‌లు వెబ్ సిరీస్ ల‌కు సంత‌కాలు చేస్తున్నారు.

శివ‌గామి ర‌మ్య‌కృష్ణ తాజాగా ఓ వెబ్ సిరీస్ కి సంత‌కం చేసిన‌ సంగ‌తి తెలిసిందే. MX ఓటీటీ చానెల్ తో ఆ మేర‌కు ఒప్పందం కుదుర్చుకుంది. అమ్మ జ‌య‌ల‌లిత జీవిత‌క‌థ ఆధారంగా గౌతమ్ మీన‌న్- ప్ర‌శాంత్ మురుగేష‌న్ సంయుక్తంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ వెబ్ సిరీస్ తెలుగు-త‌మిళం-హిందీ- బెంగాళీలో టెలీకాస్ట్ కానుంది. తాజాగా జ‌య‌ల‌లిత ఫ‌స్ట్‌ లుక్ ని రిలీజ్ చేసారు. అమ్మ జ‌య‌ల‌లిత ప్ర‌జా వేదిక‌పై ప్ర‌సంగిస్తున్న‌ప్పుడు వెన‌క వైపుగా తీసిన ఫోటో ఇది. ఇందులో ర‌మ్య‌కృష్ణ రూపాన్ని ఆల్ మోస్ట్ బ్యాలెన్స్ చేసేందుకు ప్ర‌య‌త్నించారు ర‌మ్య‌. రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించేప్ప‌టికే జ‌య‌ల‌లిత మిడిలేజీలో ప్ర‌వేశించారు కాబ‌ట్టి ర‌మ్య‌కృష్ణ ఈ పాత్ర‌కు యాప్ట్ అనే అభిమానులు భావిస్తున్నారు.

ఇక వెండితెర‌-బుల్లితెర అనే తేడా లేకుండా అన్నిచోట్లా పాపుల‌రైన ర‌మ్య‌కృష్ణ వెబ్ సిరీస్ లో ఏ మేర‌కు రాణిస్తారు? అన్న‌ది వేచి చూడాలి. ఇటీవ‌లే కింగ్ నాగార్జున స్థానంలో `బిగ్ బాస్ 3`కి రెండు ఎపిసోడ్ల‌ను ర‌మ్య కృష్ణ హోస్టింగ్ చేసి ర‌క్తి క‌ట్టించిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు వెండితెర‌పై క్యారెక్ట‌ర్ న‌టిగానూ ర‌మ్య బిజీబిజీగా ఉన్నారు.