Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: త‌లైవి జ‌య‌ల‌లిత‌గా ఎవ‌రు బెస్ట్?

By:  Tupaki Desk   |   8 Sep 2019 1:30 AM GMT
టాప్ స్టోరి: త‌లైవి జ‌య‌ల‌లిత‌గా ఎవ‌రు బెస్ట్?
X
ఒకేసారి రెండు సినిమాలు.. ఒక వెబ్ సిరీస్.. అమ్మ‌ జ‌య‌ల‌లిత బ‌యోపిక్ పేరుతో ఈ హ‌డావుడి చూస్తుంటే దేశంలో ఏ ఇత‌ర స్టార్ కి కానీ.. రాజ‌కీయ నాయ‌కుడికి కానీ.. అంత ఇమేజ్ లేదేమో అనిపించ‌క మాన‌దు. ఎన్టీఆర్ బ‌యోపిక్ ని మించిన భారీ అంచ‌నాలు త‌లైవి బ‌యోపిక్ పై క‌నిపిస్తుండ‌డం చూస్తుంటే అస‌లేం జ‌రుగుతోంది.. అన్న ఆస‌క్తి పెరుగుతోంది. ఇప్ప‌టికే ఆ రెండు సినిమాల‌కు .. వెబ్ సిరీస్ కి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం అయ్యాయి. ముడింటా క‌థానాయిక‌ల విష‌య‌మై క్లారిటీ వ‌చ్చేయ‌డంతో ఆ ముగ్గురిలో ఎవ‌రు బెస్ట్? అంటూ అభిమానుల్లో హాట్ డిబేట్ మొద‌లైంది.

తొలిగా నిత్యామీన‌న్ క‌థానాయిక‌గా ప్రియ‌ద‌ర్శిని ఓ బ‌యోపిక్ ని ప్ర‌కటించారు. `ది ఐర‌న్ లేడి- ఏ స్టోరి ఆఫ్ రివ‌ల్యూష‌న‌రీ లీడ‌ర్` పేరుతో తెర‌కెక్కుతున్న ఈ బ‌యోపిక్ కి పందెంకోడి ద‌ర్శ‌క‌నిర్మాత లింగుస్వామి పెట్టుబ‌డులు స‌మ‌కూరుస్తున్నారు. ఈ సినిమా కోసం నిత్యా ఇప్ప‌టికే రూపం మార్చుకుంది. ఇటీవ‌ల మిష‌న్ మంగ‌ళ్ ప్రమోష‌న్స్ లో నిత్యా బొద్దందం మురిపించింది. ఇదంతా అమ్మ బ‌యోపిక్ ప్రిప‌రేష‌న్ లో భాగ‌మేన‌ని అంతా భావించారు. త్వ‌ర‌లోనే చిత్రీక‌ర‌ణ‌కు రెడీ అవుతున్నార‌ని తెలుస్తోంది. అలాగే ఏ.ఎల్.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో విష్ణు ఇందూరి నిర్మించే బ‌యోపిక్ కోసం క్వీన్ కంగ‌న ఇప్ప‌టికే ప్రిప‌రేష‌న్ స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. జ‌య‌ల‌లిత‌గా ఆహార్యం మార్చుకునేందుకు కంగ‌న క‌స‌ర‌త్తులు చేస్తోంద‌ట‌. త‌న రూపాన్ని అచ్చం త‌లైవిలానే తీర్చిదిద్దేందుకు హాలీవుడ్ నుంచి స్పెష‌లిస్టుల్ని దించుతున్నారు. ఈ చిత్రానికి త‌లైవి- జ‌య అనే టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. అక్టోబ‌ర్ నుంచి సెట్స్ కెళ‌తామ‌ని నిర్మాత విష్ణు ఇందూరి తెలిపారు. తాజాగా ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో గౌత‌మ్ మీనన్ వెబ్ సిరీస్ కి సంబంధించిన లుక్ రివీలైన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కూ నిత్యా లుక్.. ర‌మ్య‌కృష్ణ పాక్షిక రూపం రివీల‌య్యాయి. ఆ ఇద్ద‌రిలో ఎవ‌రు బెస్ట్? అన్న‌ది ఆడియెన్ చెప్పాల్సి ఉంటుంది. కంగ‌న లుక్ ఎలా ఉండ‌బోతోంది? అన్న‌ది ఇంకా రివీల్ కావాల్సి ఉంది. ఓ వైపు యాక్ష‌న్ క్వీన్ గా ఫ‌స్ట్ బ్ల‌డ్ రేంజు యాక్ష‌న్ సినిమాలో న‌టించేందుకు సంత‌కం చేసిన కంగ‌న జ‌య‌ల‌లిత బ‌యోపిక్ లో న‌టిస్తుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

ఇంత‌కీ అమ్మ పాత్ర‌కు ఆ ముగ్గురిలో ఎవ‌రు బెస్ట్ గా సూట‌వుతారు..? నిత్యామీన‌న్ అంత యాప్ట్ గా మిగ‌తావాళ్లు క‌నిపిస్తారా? ఆ బొద్దుత‌నం త‌న‌కే సెట్ట‌వుతుందేమో? ఇలాంటి ప్ర‌శ్న‌లెన్నో. అయితే న‌ట‌న ప‌రంగా ర‌మ్య కృష్ణ కానీ.. కంగ‌న కానీ ఎందులోనూ త‌క్కువేమీ కాదు. ఆహార్యం పరంగా నెగ్గుకొస్తే ముగ్గురూ ఒక‌రితో ఒక‌రు పోటీప‌డే రేంజే. జ‌య‌ల‌లిత‌పై వ‌రుస‌గా రెండు భారీ చిత్రాలు.. ఒక వెబ్ సిరీస్ క‌ళ్ల ముందుకు రానున్నాయి. వీటిలో జ‌నం ఏది చూడాలి? జ‌నాల్ని క‌న్ఫ్యూజ్ చేస్తున్నారుగా..! అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.