Begin typing your search above and press return to search.

అప్పుడు మిస్సయ్యి, ఇన్నాళ్లికి దొరికింది

By:  Tupaki Desk   |   25 Jun 2015 11:00 PM IST
అప్పుడు మిస్సయ్యి, ఇన్నాళ్లికి దొరికింది
X
కొన్ని మిస్టరీలు ఎప్పటికీ ఓపెన్‌ అవ్వవు. ఆ మిస్టరీ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం ఏమిటి? అన్నది ఎప్పటికీ తెలియదు. అలాంటి ఓ అరుదైన మిస్టరీ ఓ కథానాయిక జీవితంలో తటస్థించింది అంటే నమ్మగలరా? దశాబ్ధం పాటు తిరుగులేని కథానాయికగా రాజ్యమేలిన రమ్య నంబీషన్‌ ఇటీవలి కాలంలో ఎవరికీ కనిపించకుండా ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. దీనికి కారణం పొలిటికల్‌ ఎంట్రీ అని చెప్పుకుంటున్నారు.

రమ్య కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. పిన్న వయసులో రాజకీయాల్లో ఎంపి గా ఎన్నికైన తారగా పేరు తెచ్చుకుంది. అయితే ఆ తర్వాత మాత్రం సీను రివర్సయ్యింది. గత ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేసి ఘోరంగా ఓడిపోయింది. అయితే ఆ తర్వాత రమ్య జాడ అస్సలు కనిపించలేదు. పబ్లిక్‌ అప్పియరెన్స్‌ మాటేమో గానీ, అస్సలు బెంగళూరు పరిసరాల్లో రమ్య ఉందా? లేదా? అన్న చర్చ మొదలైంది. రమ్య మిస్సింగ్‌ అంటూ మిస్టరీ కథనాలు వెలువడ్డాయి. దాంతో ఆసక్తి జనాల్లో మొదలైంది. చాలామంది రమ్య అనూహ్యంగా మిస్సవ్వడానికి కారణాలేంటా? అని ఆరాతీశారు. కానీ ఆచూకీ దొరకనేలేదు.

ఓటమి భారం తట్టుకోలేక యురోప్‌ వెళ్లిపోయిన రమ్య ఇటీవలే తిరిగొచ్చారు. బెంగళూరులోని తన ఇంట్లో రెండు వారాల పాటు విరామాన్ని కోరుకుంటున్నారు. ఈ సమయంలో తనతో తాను గడపాలని అనుకుంటున్నారని ప్రచారం సాగుతోంది ఇప్పుడు. కారణం ఏదైనా రమ్య మిస్సింగ్‌కి సంబంధించిన డీటెయిల్స్‌ త్వరలోనే తెలుస్తాయేమో చూడాలి.