Begin typing your search above and press return to search.

స్టార్ హీరోకి అమ్మగా శివగామి రెడీ

By:  Tupaki Desk   |   10 Feb 2017 8:42 AM GMT
స్టార్ హీరోకి అమ్మగా శివగామి రెడీ
X
ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన రమ్యకృష్ణ.. కాలంతో పాటే తను చేసే పాత్రలను కూడా మార్చుకుంటూ వస్తోంది. ఇప్పటికే స్టార్ హీరోకి అత్త కేరక్టర్ లో కూడా కనిపించేసిన ఈ మాజీ హీరోయిన్.. బాహుబలితో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది. ఆ మూవీలో చేసిన శివగామి పాత్ర.. రమ్యకృష్ణకు తిరుగులేని ఇమేజ్ సంపాదించిపెట్టింది.

ఇప్పుడు రమ్యకృష్ణ ఓ స్టార్ హీరోకి అమ్మపాత్రలో నటించేందుకు ఒప్పుకోవడం.. ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే.. ఇది టాలీవుడ్ లో మాత్రం కాదు. కన్నడ స్టార్ హీరో అయిన పునీత్ రాజ్ కుమార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీలో అతనికి తల్లి పాత్రలో నటించనుంది రమ్యకృష్ణ. ఈ మూవీకి అంజనీ పుత్ర అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. కొరియోగ్రాఫర్ హర్ష.. ఈ చిత్రంతో దర్శకుడిగా టర్న్ తీసుకుంటున్నాడు. కోలీవుడ్ హీరో విశాల్ నటించిన పూజై.. తెలుగులో పూజ అంటూ డబ్బింగ్ వెర్షన్ గా వచ్చింది. ఈ సినిమానే ఇప్పుడు కన్నడలో అంజనీ పుత్ర టైటిల్ పై రీమేక్ చేస్తున్నారు.

పూజ మూవీలో హీరో విశాల్ కు అమ్మగా రాధిక నటించగా.. ఇప్పుడు ఆ పాత్రలోనే రమ్యకృష్ణ నటించనుంది. గతంలో మాణిక్య అనే కన్నడ మూవీలో కూడా కిచ్చా సుదీప్ కి అమ్మగా నటించింది రమ్యకృష్ణ. ఇది ప్రభాస్ నటించిన మిర్చి మూవీకి కన్నడ రీమేక్. ఇలా వరుసగా కన్నడ స్టార్ హీరోలకు అమ్మగా నటిస్తున్న రమ్యకృష్ణ.. టాలీవుడ్ లోనూ మంచి ఆఫర్ వస్తే సేమ్ రోల్స్ లో కనిపించే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఫిలింనగర్ జనాలు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/