Begin typing your search above and press return to search.

ఇలాంటి టైమ్‌ లైఫ్‌ లో దొరకలేదు!

By:  Tupaki Desk   |   16 May 2020 10:45 AM IST
ఇలాంటి టైమ్‌ లైఫ్‌ లో దొరకలేదు!
X
లాక్‌ డౌన్‌ కారణంగా సినిమా పరిశ్రమ పూర్తిగా స్థంభించింది. షూటింగ్స్‌ లేక అంతా ఇంటికే పరిమితం అవుతున్నారు. ఎప్పుడు షూటింగ్స్‌ తో బిజీ బిజీగా గడిపే స్టార్స్‌ గత రెండు నెలలుగా ఖాళీగా ఉంటున్నారు. కొందరికి ఇది బాగున్నా కొందరు మాత్రం బాబోయ్‌ ఏంటీ ఇది అనుకుంటున్నారు. ఇంకా కొన్నాళ్లు ఖాళీగా ఉంటే ఏమవుతామో అనే ఆందోళన కూడా సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. తాజాగా లాక్‌ డౌన్‌ టైంను ఎలా గడుపుతున్నారంటూ రమ్యకృష్ణను మీడియా ప్రశ్నించగా ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

ఆమె మాట్లాడుతూ.. లాక్‌ డౌన్‌ లేకుండా ఉంటే రంగమార్తాండ.. పూరి విజయ్‌ దేవరకొండల మూవీ.. సాయి ధరమ్‌ తేజ్‌ మూవీతో పాటు క్వీన్‌ 2 వెబ్‌ సిరీస్‌ షూటింగ్స్‌ లో పాల్గొనేదాన్ని. రెండు హిందీ ప్రాజెక్ట్స్‌ ఒక ఇంటర్నేషనల్‌ ప్రాజెక్ట్‌ కూడా నా వద్దకు వచ్చాయి. లాక్‌ డౌన్‌ తర్వాత ఏం జరుగబోతుందో చూడాలి. ఏ సినిమాలు ఎప్పుడు ప్లాన్‌ చేస్తారనే విషయం తెలియదు అంటోంది. అయితే లాక్‌ డౌన్‌ వల్ల మునుపెన్నడు చూడని కొత్త జీవితం చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.

ఈ సమయం మళ్లీ జీవితంలో దొరుకుతుందో లేదో తెలియదు. రెండు నెలలుగా గుమ్మం దాటి బయటకు వెళ్లడం లేదు. టైం అంతా కూడా ఫ్యామిలీ తో స్పెండ్‌ చేసే అవకాశం వచ్చిందని సంతోషం గా ఉన్నా మరో వైపు మాత్రం ఒకింత ఆందోళనగా ఉందని చెప్పుకొచ్చింది. వలస కూలీల పరిస్థితిని చూస్తుంటే బాధగా ఉందని కూడా రమ్యకృష్ణ పేర్కొంది.

ఇక క్వీన్‌ 2 వెబ్‌ సిరీస్‌ గురించి స్పందిస్తూ... గౌతమ్‌ మీనన్‌ పై నమ్మకంతో ఈ వెబ్‌ సిరీస్‌ ను చేశాను. ఆయన మంచి స్ట్రాంగ్‌ స్క్రిప్ట్‌తో ఈ వెబ్‌ సిరీస్‌ ను తెరకెక్కించాడు. అందుకే ఆ అవకాశాన్ని వదులుకోలేదు. సీజన్‌ 2 కోసం నేను ఎదురు చూస్తున్నాను. తప్పకుండా మరో మంచి వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకుల ముందుకు వస్తుందనే నమ్మకం నాకు ఉందని రమ్యకృష్ణ ఆశాభావం వ్యక్తం చేసింది.