Begin typing your search above and press return to search.

కవరెక్కిన శివగామి

By:  Tupaki Desk   |   7 Aug 2017 10:24 AM IST
కవరెక్కిన శివగామి
X
రమ్య కృష్ణ హీరోయిన్ గా ఎంత పేరు సంపాదించిందో హీరోయిన్ గా కెరియర్ ముగించి మళ్ళీ బాహుబలి సినిమాలో ప్రభాస్, రానాలకు అమ్మగా చేసి ఇంటర్నేషనల్ ప్రేక్షకులును సైతం ఆకట్టుకుంది. బాహుబలి సినిమాలో ఆమె శివగామి పాత్రలో ఒదిగిపోయాన విదనం మొత్తం దేశం జై హొ అన్నారు. భావన్నంత తనే కళ్ళతోనే చెప్పి సినిమా విజయంలో భాగమైంది.

అయితే ఫ్యాషన్ మ్యాగజైన్ కవర్ పై సాదారణంగా యంగ్ అండ్ హాట్ హీరోయిన్లు ఫోటో పెడతారు. రమ్య కృష్ణ యంగ్ కాకపోయినా హాట్ కాదు అని మాత్రం అనలేము. ఎందుకంటే ఆమె హీరోయిన్ గా చేస్తున్నప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు అమ్మ పాత్రలు చేస్తున్న అంతే హాట్ గా కనిపిస్తుంది. ఇక్కడ రమ్య కృష్ణ ఇచ్చిన ఫోజ్ చూస్తే అమ్మాయిలే కాదు అమ్మ పాత్రలు చేస్తున్న హీరోయిన్లు కూడా అందంగా హాట్ గా ఉంటారు అని చెప్పక తప్పదు. పట్టు బట్టలు వేసుకొని ముత్యాలహారం దరించి రాజమాత ఇలానే ఉంటారు ఏమో అనేలా కనిపిస్తుంది. పాత పద్దతి వేషంలో కనిపిస్తూనే తన అందంతో అందరిని ఆకట్టుకుంది.

బాహుబలి సినిమా తరువాత మళ్ళీ బాగ బిజీ అయ్యింది రమ్య కృష్ణ. ఈ సినిమాకు ముందు కొన్ని సినిమాలులో కనిపించిన అవి ఏవి తన కెరియర్ ని గొప్పగా మలచలేదు. తనకు దక్కిన ఈ ఆదరణ పై రమ్య కృష్ణ ఏమందంటే.. ”నేను కలలో కూడా అనుకోలేదు నా జీవితంలో ఒక పాత్ర ఇంత ప్రభావం చూపిస్తుంది అని. బాహుబలి సినిమా నా కెరియర్ని గొప్ప మలుపు తిప్పింది. ఈ సినిమా ద్వారా పొందిన ఆనందాన్ని ఎప్పటికీ మరవలేను'' అని చెబుతుంది.