Begin typing your search above and press return to search.

రమ్యకృష్ణ కారులో భారీగా పట్టుబడ్డ మద్యం ?

By:  Tupaki Desk   |   13 Jun 2020 4:20 PM IST
రమ్యకృష్ణ కారులో భారీగా పట్టుబడ్డ మద్యం ?
X
ప్రముఖ సినీ నటి రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం ప‌ట్టుబడింది అని ఓ వార్త ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం పట్టుబడిందన్న వార్తలతో సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. చెన్నైలోని ఈసీఆర్ రోడ్డులో కానత్తూర్ సమీపంలో పోలీసులు వాహనతనిఖీలు చేస్తుండ‌గా..రమ్యకృష్ణకు చెందిన ట‌యోటా ఇన్నోవా క్రిస్టా కారు( TN07Q 0099) అటుగా వచ్చిందని, దీంతో ఆమె వాహ‌నాన్ని పోలీసులు తనిఖీ చేశారని, అందులో 96 బీర్ బాటిల్స్, 8 లిక్క‌ర్ సీసాలు గుర్తించారని, దీంతో వెంట‌నే ఆమె వాహ‌న డ్రైవ‌ర్ సెల్వకుమార్ ని అదుపులోకి తీసుకున్నారని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. అయితే కొద్దిసేపటికే రమ్యకృష్ణ స్వయంగా వచ్చి సెల్వకుమార్ ‌ను బెయిల్ ‌పై తీసుకుని వెళ్లినట్లుగా ప్రసారమాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే, దీనిపై రమ్యకృష్ణ క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం ఏంటో తెలియదు.