Begin typing your search above and press return to search.

అరుదైన వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్

By:  Tupaki Desk   |   28 Nov 2018 5:12 PM IST
అరుదైన వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్
X
దివ్య స్పందన.. కర్ణాటక రాష్ట్రంలో హీరోయిన్ అవుదామని శాండిల్ వుడ్ కు వచ్చిన ఒక సాధారణ యువతి. కానీ ఆమెను అగ్రహీరో అంబరీష్ చేరదీశారు.హీరోయిన్ ను చేశారు. అనంతరం రాజకీయాల్లోకి తెచ్చి ఎంపీని కూడా చేశారు. ఆమె రమ్యగా కర్ణాటకలో ఫైర్ బ్రాండ్ గా వెలుగొందుతోంది. కానీ ఇప్పుడు సడన్ గా అంబరీష్ చనిపోతే రమ్య కనిపించలేదు. తనకు అన్ని ఇచ్చిన గురువు గారిని కనీసం కడచూపు కూడా చూడలేదు. దీంతో దీనిపై సోషల్ మీడియా, మీడియాలో అందరూ దుమ్మెత్తిపోశారు. దీనిపై తాజాగా రమ్య సోషల్ మీడియాలో వివరణ ఇచ్చింది.

మాజీ ఎంపీ రమ్య తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో కాలుకు శస్త్ర చికిత్స చేయించుకున్న ఫొటోను పోస్టు చేసి కింద సందేశం రాసుకొచ్చింది. తన కాలుకు అరుదైన వ్యాధి సోకడంతోనే తాను అంబరీష్ అంకుల్ అంత్యక్రియలకు హాజరు కాలేదని.. ఇందుకు ఎంతో బాధపడుతున్నాని ఆమె పేర్కొన్నారు.

10 లక్షల మందిలో ఒకరికి సోకే ఆస్టియోకాల్ యటోమా అనే అరుదైన వ్యాధి తనకు సోకిందని మాజీ ఎంపీ రమ్య సోషల్ మీడియాలో ప్రకటించారు. ఎముక మూలుగకు సంబంధించిన వ్యాధి ఇది అని దీన్ని నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్ కు దారి తీసే ప్రమాదం ఉంటుందని పేర్కొంది. అందుకే ఆపరేషన్ చేయించుకొని అక్టోబర్ నుంచి విశ్రాంతి తీసుకుంటున్నానని తెలిపింది. ఈ వ్యాధికి చికిత్స లేదని.. ఆపరేషన్ చేయించుకొని ప్రయత్నిస్తున్నానని తెలిపారు. అందుకే అంబరీష్ అంత్యక్రియలకు రాలేదని వివరణ ఇచ్చింది. దీంతో నెటిజన్లు, మీడియా రమ్య పరిస్థితి చూసి విమర్శలను ఆపేశారు.