Begin typing your search above and press return to search.

`రామ‌సీల‌క రీల్ ఛాలెంజ్` 40 మందికి ఛాన్స్!

By:  Tupaki Desk   |   8 April 2022 2:28 PM GMT
`రామ‌సీల‌క రీల్ ఛాలెంజ్` 40 మందికి ఛాన్స్!
X
యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ కెరీర్ హ్యాపీగా సాగిపోతున్న సంగ‌తి తెలిసిందే. న‌టుడిగా త‌న‌కంటూ ఓ ఐడెంటీని వేసాడు. `ఫ‌ల‌క్ నుమా దాస్` నుంచి `పాగ‌ల్` వ‌ర‌కూ డిఫ‌రెంట్ పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల్ని మెప్పించే ప్ర‌య‌త్నాలు కొంత వ‌ర‌కూ స‌క్సెస్ అయ్యాయి. ప్రామిసింగ్ న‌టుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. చోచుకుపోయే త్వత్వం..త‌న‌లో ఎనర్జీ ద‌ర్శ‌క‌-నిర్మాత‌ల్ని అట్రాక్ చేస్తోంది.

త‌న‌లో ఆ క్వాలిటీనే ప్ర‌ధానంగా అవ‌కాశాల‌కు పునాది వేసిందిగా చెప్పొచ్చు. తాజాగా యంగ్ హీరో ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ అనే సినిమాతో రాబోతున్నాడు. ఇందులో రుష్కర్ దిల్లాన్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర డిజిటల్ బ్యానర్ పై బాపినీడు.. సుధీర్ నిర్మిస్తుండగా విద్యా సాగర్ తెరకెక్కిస్తున్నారు. అన్ని ప‌నులు పూర్తి చేసుకుని ఏప్రిల్ 22న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. దీంతో యూనిట్ ప్ర‌చారం ప‌నుల్ని ముమ్మ‌రం చేసింది.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో సినిమాపై పాజిటివ్ సైన్ ప‌డింది. గ్లింప్స్ .. సాంగ్..టీజ‌ర్ ఆకట్టుకున్నాయి. టీజ‌ర్ లో ఆద్యంతం కామెడీతో పాటు ఎమోషన్ ని హైలైట్ చేసారు. ఇక రంగు రంగు రామ సిల‌క సాంగ్ కి శ్రోత‌ల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో ఈ పాట ప‌ల్ల‌వితోనే `రామ‌సిల‌క రీల్ ఛాలెంజ్` ని ప్రారంభించారు.

దీనిలో భాగంగా ఈ పాట లో సిగ్నెచ‌ర్ స్టెప్ తో మెప్పిస్తే సినిమా హీరోని..యూనిట్ తో క‌లిసి సినిమా చూసే అవ‌కాశం ల‌భిస్తుంది. కాంటెస్ట‌స్ కి సంబంధించిన వివ‌రాల్ని విశ్వ‌క్ సేన్ ఓ వీడియో ద్వారా స్టెప్ వేసి తెలియ‌జేసారు. ``స్టెప్ చూసారు క‌దా. చాలా సింపుల్. ఈ స్టెప్ మాత్రం మీరు కాకుండా... మమ్మీ..డాడీ..అమ్మ‌మ్మ ..తాత‌య్య ఎవ‌రితో చేయించినా టాప్ 10 కంటెస్ట్ టెంట్స్ ని ఎంపిక చేస్తాం. మొద‌టి ఐదుగురు ఫీమేల్ కంటెస్టెంట్ల ఇంటికి లంచ్ కి వ‌స్తాను. మేల్ తో అయితే ఈవినింగ్ మందు పార్టీకి వ‌స్తాను. టాప్ 40 కంటెస్ట్ అయితే టీమ్ తో పాటు ప్ర‌సాద్ ఐమాక్స్ లో మార్నింగ్ ఫ‌స్ట్ షో చూసే అవ‌కాశం ఉంటుంద‌ని`` తెలిపారు.