Begin typing your search above and press return to search.

శాస్త్రి గారు.. ప్రేమ చూపిస్తున్నారు

By:  Tupaki Desk   |   1 April 2016 1:30 AM GMT
శాస్త్రి గారు.. ప్రేమ చూపిస్తున్నారు
X

టాలీవుడ్ లో రామజోగయ్య శాస్త్రికి గేయ రచయితగా చాలా మంచి పేరు ఉంది. స్టార్ హీరోలతో సహా అనేక చిత్రాల్లో మొత్తం ఆల్బం అంతా ఆయనతోనే రాయించుకునేందుకు కూడా దర్శక నిర్మాతలు ఇష్టపడతారు. ఒకవైపు పాటలు రాస్తూనే.. అడపాదడపా వెండితెరపై మెరుస్తూ ఉంటాడీయన.

రీసెంట్ గా అయితే గతేడాది వచ్చిన మహేష్ మూవీ శ్రీమంతుడు చిత్రానికి రామజోగయ్య శాస్త్రి రాసిన పాటలకు చాలా మంచి పేరొచ్చింది. అంతే కాదు ఆ సినిమాలో ఓ పాటలో కూడా కనిపిస్తారీయన. అంతే కాదు.. అంతకుముందు శ్రీనువైట్ల -నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన కింగ్ చిత్రంలో కూడా చిన్న కేరక్టర్ చేశారు రామజోగయ్య. ఇప్పుడు నాగార్జున తనయుడి లేటెస్ట్ మూవీ లో ఓ మంచి కేరక్టర్ లో చేస్తుండడం విశేషం.

ప్రస్తుతం చైతు చేస్తున్న ప్రేమమ్ చిత్రంలో రామజోగయ్య శాస్త్రికి ఓ చిన్నపాటి కేరక్టర్ ఉంటుందట. ఈ పాత్ర సినిమాలో ఆకట్టుకుంటుందని అంటున్నారు. ఇప్పటివరకూ ఇలా కనిపించి అలా వెళ్లిపోయే రోల్స్ లో చేసిన తనకు.. ఓ పూర్తిస్థాయి పాత్రలో కనిపించే అవకాశం ఇచ్చిన దర్శకుడు చందు మొండేటి, హీరో నాగచైతన్యకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అంటున్నాడీ లిరిక్ రైటర్. మరి రైటర్ గా కాకుండా యాక్టర్ గా ఏ మాత్రం మెప్పిస్తాడో చూడాలి.