Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో ర‌మికా సేన్ హ‌వా మొద‌లైందా?

By:  Tupaki Desk   |   23 April 2022 1:30 PM GMT
టాలీవుడ్ లో ర‌మికా సేన్ హ‌వా మొద‌లైందా?
X
ఏ మూవీ ఎప్పుడు ఎలాంటి వండ‌ర్స్ క్రియేట్ చేస్తుందో ఎవ‌రిని ఎక్క‌డ ఎలా స్టార్ ని చేస్తుందో చెప్ప‌లేం. ఎందుకంటే ఇక్క‌డ ఏదైనా సాధ్య‌మే కాబ‌ట్టి. వీక్ అనుకున్న వారు స్ట్రాంగ్ గా మారొచ్చు.. స్ట్రాంగ్ అనుకున్న వారు వీక్ గా మారిపోవ‌చ్చు.. ఇవ‌న్నీ ఒకే ఒక్క సినిమా డిసైడ్ చేస్తుంది. అలా డిసైడ్ చేసిన సినిమానే 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 2'. టీవీ న‌టుడు న‌వీన్ కుమార్ గౌడ (య‌ష్ అస‌లు పేరు) ని తిరుగులేని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టింది. వ‌న్ ఫిల్మ్ వండ‌ర్ ప్ర‌శాంత్ నీల్ ని ఇండియా వైడ్ గా స్టార్ డైరెక్టర్ గా పాపుల‌ర్ అయ్యేలా చేసింది.

కెరీర్ ఇక అయిపోయింద‌ని భావించిన ర‌వీనా టాండ‌న్ ని మ‌ళ్లీ బిజీ స్టార్ గా మార్చేసింది. దాదాపు నాలుగేళ్లుగా ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా వున్న ప్రేక్ష‌కులు 'బాహుబ‌లి 2' కోసం ఎదురుచూసినంత‌గా ఎదురు చూశారు.

గ‌రుడ‌ని చంపిన త‌రువాత రాఖీ బాయ్ ఏం చేశాడు? ఎలా కేజీఎఫ్ ని త‌న హ‌స్త‌గ‌తం చేసుకున్నాడు? .. అన్న‌ది ప్ర‌తీ ఒక్క‌రిలోనూ ఆస‌క్తిని రేకెత్తించి 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 2' కోసం ఆస‌క్తిగా ఎదురుచూసేలా చేసింది. ఎట్ట‌కేల‌కు దాదాపు నాలుగేళ్ల త‌రువాత థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా ప్ర‌భంజ‌నాన్ని సృష్టిస్తూ వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది.

వ‌సూళ్ల ప‌రంగా దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్ వైడ్ గా 750 కోట్ల మార్క్ ని ట‌చ్ చేసింది. అంతే కాకుండా హిందీ మార్కెట్ లో ఈ మూవీ 280 కోట్లు కొల్ల‌గొట్టి త్వ‌ర‌లో 300 కోట్ల మార్కుకి చేర‌బోతోంది. ఓవరాల్ గా త్వ‌ర‌లోనే 1000 కోట్ల మార్కుకు చేర‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ పండితులు అంటున్నారు. భారీ అంచ‌నాల‌తో విడుద‌లైన ఈ మూవీ అంత‌కు మించిన స్థాయిలో వ‌సూళ్ల సునామీని సృష్టిస్తూ రికార్డు స్థాయిలో వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తుండ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇదిలీఆ వుంట ఇందులో న‌టించిన న‌టీన‌టుల‌కు క్రేజీ ఆఫ‌ర్ల వెల్లువ మొద‌లైంది. అధీరాగా న‌టించిన సంజ‌య్ ద‌త్ కు స్టార్ డైరెక్ట‌ర్స్ క్రేజీ ఆఫ‌ర్లు ఇస్తున్నారు. ఇక ర‌మికా సేన్ పాత్ర‌లో న‌టించిన ర‌వీనా టాండ‌న్ చుట్టూ మ‌న స్టార్ డైరెక్ట‌ర్స్ ఇప్ప‌టికే తిర‌డం మొద‌లుపెట్టారు. 'నా ద‌గ్గ‌ర సైన్య‌ముందీ...గుస్ కే మారేంగే' అంటూ ప‌వ‌ర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో ఆక‌ట్టుకున్న ర‌వీనా టాండ‌న్ కు టాలీవుడ్ లో ఆఫ‌ర్ల వెల్లువ మొద‌లైంది. ఇప్ప‌టికే చాలా మంది ద‌ర్శ‌కులు ర‌వీనా ని కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌మ‌ని క్యూ క‌డుతున్నార‌ట‌.

ఆల్ రెడీ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ ఆమెని సంప్ర‌దించిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో హ‌రీష్ శంక‌ర్ 'భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్‌' చిత్రాన్ని చేస్తున్న విష‌యం తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై త్వ‌ర‌లో సెట్స్ పైకి రానున్న ఈ మూవీలోని ఓ కీల‌క పాత్ర కోసం ర‌వీనా టాండ‌న్ అయితే బాగుంటుంద‌ని హ‌రీష్ శంక‌ర్ భావించి ఇటీవ‌లే ఆమెని సంప్ర‌దించార‌ని, దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి వుంద‌ని తెలిసింది. ఇదే జ‌రిగే టాలీవుడ్ లో ర‌వీనా టాండ‌న్ హ‌వా మొద‌లైన‌ట్టే అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు. గ‌తంలో నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన 'బంగారు బుల్లోడు' చిత్రంలో ర‌వీనా టాండ‌న్ న‌టించిన విష‌యం తెలిసిందే.