Begin typing your search above and press return to search.

అబ్బాయితో అమ్మాయి.. దర్శకుడి కబుర్లు

By:  Tupaki Desk   |   29 Dec 2015 9:00 PM IST
అబ్బాయితో అమ్మాయి.. దర్శకుడి కబుర్లు
X
నాగశౌర్య - పల్లక్ లల్వాని హీరో హీరోయిన్లుగా నటించిన 'అబ్బాయితో అమ్మాయి'న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న రిలీజ్ కాబోతోంది. రవితేజతో వీర తీసిన డైరెక్ట్ చేసిన రమేష్ వర్మ.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. వీర తర్వాత ఓ లవ్ స్టోరీ చేసే ఉద్దేశ్యంతో ఈ స్టోరీ రాసుకున్నాడట రమేష్ అయితే.. కొత్త వాళ్లతో తీసే చిత్రానికి 4 కోట్ల బడ్జెట్ అంటే చాలామంది నిర్మాతలు వెనక్కు తగ్గారట.

దీంతో నాగశౌర్యను తానే లాంఛ్ చేద్దామని అనుకున్న రమేష్ వర్మ.. ఇప్పుడు తను హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంలో అబ్బాయితో అమ్మాయి చేశాడు. ఈ మూవీ ద్వారా ఓ కొత్త ప్రేమకథను చెబ్తానంటున్నాడు డైరెక్టర్. ఇప్పుడంతా ఫేస్ బుక్ - వాట్సాప్ కాలం అని .. అలా తమకు తెలీకుండానే ఒకరినొకరు ప్రేమించుకున్న ఓ ఇద్దరు స్నేహితుల కథ ఇదని చెప్పాడు రమేష్ వర్మ. అయితే.. కేవలం యూత్ ని మాత్రమే కాకుండా.. ఫ్యామిలీ ఆడియన్స్ కుడా ఆకట్టుకునే కంటెంట్ తో అబ్బాయితో అమ్మాయిని రూపొందించినట్లు చెప్పాడు. ఇళయరాజాతో తనకున్న అనుబంధం కారణం కానే.. ఆయనతో సంగీతం చేయించినట్లు తెలిపాడు.

అలాగే.. ఈ స్టోరీ విన్న ఇళయరాజా తమిళ్ లో కూడా రిలీజ్ చేయమని సలహా ఇచ్చారట. అందుకే ఒకేసారి రెండు భాషల్లోనూ రిలీజ్ చేసే ధైర్యం చేశానంటున్నాడు. తాను రూపొందించిన మూవీ పై నిర్మాతలు పూర్తి నమ్మకంతో ఉన్నారని.. అందుకే పోటీ ఉన్నా సరే ధైర్యంగా రిలీజ్ చేస్తున్నట్లు చెప్పాడు. 3 కోట్ల బడ్జెట్ అనుకుంటే.. చివరకు 6 కోట్లకు లెక్క తేలినా, నిర్మాతలు సహకరించారట. దీని తర్వాత ఓ పెద్ద హీరోతో మూవీ చేయాలనే ఐడియాలో ఉన్న రమేష్ వర్మకు.. అబ్బాయితో అమ్మాయి హిట్ కావడం చాలా ముఖ్యం.