Begin typing your search above and press return to search.

పోస్టర్లతో కొడుతున్న ఫ్లాప్ డైరెక్టర్

By:  Tupaki Desk   |   2 Nov 2015 9:30 AM GMT
పోస్టర్లతో కొడుతున్న ఫ్లాప్ డైరెక్టర్
X
గుర్తున్నాడా రమేష్ వర్మ.. ‘ఒక ఊరిలో’ లాంటి ఫ్లాప్ సినిమాతో డైరెక్టర్ అయి.. ఆ తర్వాత ‘రైడ్’తో సక్సెస్ అందుకుని.. మళ్లీ ‘వీర’ సినిమాతో దారుణమైన ఫ్లాప్ అందుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ కోలుకుని సినిమా చేయడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడు మళ్లీ తనదైన స్టయిల్లో ఓ లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడతను. పేరు.. అబ్బాయితో అమ్మాయి. బబ్లీ హీరో నాగశౌర్య, కొత్తమ్మాయి పల్లక్ లల్వాని జంటగా నటించారు. రెండు నెలల కిందట ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేసి ఆసక్తి రేపాడు రమేష్ వర్మ. అప్పుడు హీరో హీరోయిన్లు ముఖాలు చూపించలేదు.

తాజాగా హీరో హీరోయిన్లను అందంగా చూపిస్తూ.. బ్యూటి ఫుల్ బ్యాగ్రౌండ్ తో అట్రాక్టివ్ పోస్టర్లు వదిలాడు రమేష్ వర్మ. మనోడు గతంలో పబ్లిసిటీ డిజైనర్. ఆ అనుభవంతో తన కొత్త సినిమా పోస్టర్లు చాలా అందంగా తీర్చిదిద్దాడు. ఈ పోస్టర్లు చూస్తుంటే అందమైన ప్రేమకావ్యం తీశాడేమో అనిపిస్తోంది. ఐతే రమేష్ ట్రాక్ రికార్డు మాత్రం భయపెడుతోంది. ఇదొక భిన్నమైన హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అంటున్నారు ఈ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగపెడుతున్న ముగ్గురు నిర్మాతలు. షూటింగ్ పూర్తయిన ఈ సినిమాను డిసెంబరులో విడుదల చేస్తారట. ఈ నెల 7న హైదరాబాదులో ఆడియో ఫంక్షన్ చేయబోతున్నారు. సినిమాకు సంబంధించిన పెద్ద విశేషం అంటే.. ఇళయరాజా సంగీతం అందించడం. తన తొలి సినిమా దగ్గర్నుంచి ఇళయరాజాతో పని చేయడానికి ట్రై చేస్తున్న రమేష్ వర్మ.. ఎట్టకేలకు ఆయన్ని ఒప్పించి సంగీతం చేయించుకున్నాడు. ఆడియో ఫంక్షన్ కు మేస్ట్రో కూడా హాజరవుతారట.