Begin typing your search above and press return to search.

ఆ డైరెక్టర్‌ ఇన్నాళ్లకు కోలుకున్నాడు

By:  Tupaki Desk   |   9 July 2015 11:30 AM GMT
ఆ డైరెక్టర్‌ ఇన్నాళ్లకు కోలుకున్నాడు
X
రమేష్‌ వర్మ.. ఓ విచిత్రమైన డైరెక్టర్‌. ఒక ఊరిలో.. లాంటి లవ్‌ స్టోరీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత భూమిక ప్రధాన పాత్రలో మల్లెపువ్వు అనే సినిమా తీశాడు. తొలి రెండు సినిమాలు అట్టర్‌ ఫ్లాప్‌ అయినా.. మళ్లీ ఓ కొరియన్‌ సినిమాను కాపీ కొట్టి 'రైడ్‌' తీసి తొలి సక్సెస్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత రవితేజ లాంటి స్టార్‌ హీరోతో సినిమా చేసే అవకాశం దక్కించుకోవడంతో ఇక అతడికి తిరుగులేదనుకున్నారు. కానీ 'వీర' రూపంలో రవితేజకు పెద్ద డిజాస్టర్‌ ఇచ్చి.. చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి మూడేళ్లకు పైనే పట్టింది రమేష్‌ వర్మకు.

ఇన్నాళ్లకు మళ్లీ ఇంకో సినిమా చేస్తున్నాడు రమేష్‌. ఈసారి ఓ చిన్న హీరోతో జట్టు కటాడతను. మాస్‌ హీరో అయిపోవాలన్న ఆశలతో 'జాదూగాడు'లో నటించి పెద్ద ఎదురుదెబ్బ తిన్న నాగశౌర్యతో రమేష్‌ వర్మ సినిమా ఓకే అయింది. ఇది కొంచెం లవ్‌, కొంచెం యాక్షన్‌ కలగలిపిన ఎంటర్టైనర్‌ అని చెబుతున్నారు. ఈ సినిమాకు లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇళయరాజా సంగీతాన్నందిస్తుండటం విశేషం. రమేష్‌ వర్మ సినిమాలు ఎలా ఉన్న అతడికి మ్యూజిక్‌ విషయంలో మంచి టేస్టుందన్నది వాస్తవం. తీసిన నాలుగు సినిమాల్లోనూ మ్యూజిక్‌కు మంచి రెస్పాన్సే వచ్చింది. మల్లెపువ్వు సినిమాకు ఇళయరాజాతో పట్టుబట్టి మ్యూజిక్‌ చేయించుకున్న రమేష్‌ వర్మ.. మళ్లీ ఇంకోసారి పెద్దాయన్ని ఒప్పించాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ కూడా మొదలైంది. నందిని రెడ్డితో 'కళ్యాణ వైభోగమే' పూర్తి చేసి.. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు నాగశౌర్య.