Begin typing your search above and press return to search.

రమేష్‌ వర్మ మరో ప్రయత్నం

By:  Tupaki Desk   |   29 Aug 2018 6:57 AM GMT
రమేష్‌ వర్మ మరో ప్రయత్నం
X
టాలీవుడ్‌ లో పబ్లిసిటీ డిజైనర్‌ గా చాలా సంవత్సరాలుగా కొనసాగుతూ మంచి పేరు తెచ్చుకున్న రమేష్‌ వర్మకు దర్శకత్వంపై చాలా మోజు. ఆ మోజుతోనే ఈయన తరుణ్‌ తో ‘ఒక ఊరిలో’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ చిత్రం ఫ్లాప్‌ అవ్వడంతో రమేష్‌ వర్మ తీవ్ర నిరాశ పడ్డాడు. ఆ తర్వాత కొంత గ్యాప్‌ తీసుకుని ‘రైడ్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కించి పర్వాలేదు అనిపంచుకున్నాడు. రైడ్‌తో వచ్చిన మంచి మార్కులను రవితేజతో తెరకెక్కించిన ‘వీర’ చిత్రంతో పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత ‘అమ్మాయితో అబ్బాయి’ అనే చిత్రాన్ని కూడా రమేష్‌ వర్మ తెరకెక్కించాడు. కాని వరుసగా ఆయనకు నిరాశే మిగిలింది.

దర్శకుడిగా సక్సెస్‌ అవ్వలేక పోతున్న రమేష్‌ వర్మ తాజాగా రచయితగా మారి సినిమా నిర్మాణం చేపడుతున్నాడు. రమేష్‌ వర్మ కొత్తగా ‘సెవెన్‌’ అనే ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించాడు. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తూ స్క్రిప్ట్‌ను రమేష్‌ వర్మ అందిస్తుండగా - ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ నిజార్‌ షఫీ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ చిత్రం టైటిల్‌ లోగోను రమేష్‌ వర్మ తాజాగా విడుదల చేశాడు.

స్వతహాగా పబ్లిసిటీ డిజైనర్‌ అయిన రమేష్‌ వర్మ తన టైటిల్‌ లోగోతో సినిమాపై ఆసక్తిని కలిగేలా చేస్తున్నాడు. త్వరలోనే కొత్తవారితో ఈ చిత్రంను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీగా తెరకెక్కబోతున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడిగా సక్సెస్‌ కాలేక పోయిన రమేష్‌ వర్మ రచయితగా నిర్మాతగా అయిన సక్సెస్‌ను అందుకుంటాడా అనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.