Begin typing your search above and press return to search.

RC15 కియారాకి తొలి పాన్ ఇండియా మూవీ!

By:  Tupaki Desk   |   13 Aug 2021 12:30 PM GMT
RC15 కియారాకి తొలి పాన్ ఇండియా మూవీ!
X
మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కెరీర్ ల్యాండ్ మార్క్ (15వ) చిత్రానికి స్టార్ ఫిలిం మేక‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. స‌ర్వ‌త్రా ఉత్కంఠ రేపుతున్న ఈ రేర్ కాంబినేష‌న్ నుంచి పాన్ ఇండియా ట్ర‌య‌ల్స్ అంత‌కంత‌కు వేడి పెంచుతున్నాయి. శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో ఇది అత్యంత భారీ బ‌డ్జెట్ తో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతుంది. చ‌ర‌ణ్ ని యూనివ‌ర్శ‌ల్ క‌థాంశంతో యూనిక్ గా ఆవిష్క‌రించ‌డానికి శంక‌ర్ కూడా ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా ఉన్నారు. ఓ జిల్లా క‌లెక్ట‌ర్ త‌న‌ ప‌ద‌విని వ‌దిలి రాజ‌కీయాల్లో కి వ‌చ్చి ముఖ్య‌మంత్రి అయితే ఎలా ఉంటుంది? అన్న పాయింట్ తో తెర‌కెక్క‌నుంది. భార‌తీయుడు రేంజ్ లో ఈ సినిమాని తెర‌కెక్కించ‌నున్నారంటూ ఇప్ప‌టికే ప్ర‌చారం సాగుతోంది. న‌టుడిగా చ‌ర‌ణ్ కి కెరీర్ బెస్ట్ మూవీగా నిలుస్తుంద‌ని మెగా ఫ్యామిలీ కాన్ఫిడెంట్ గా ఉంది. ప్ర‌స్తుతం శంక‌ర్ న‌టీన‌టుల ఎంపికలో త‌ల‌మున‌క‌లై ఉన్నారు.

ఇందులో ప్ర‌ధాన‌ హీరోయిన్ గా కియారా అద్వాణీని ఎంపిక చేసారు. కియారాకి కూడా ఇదే తొలి పాన్ ఇండియా మూవీ. బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసిన‌ప్ప‌టికీ యూనిక్ ఐడెంటిటీ ఏదీ త‌న‌కు క్రియేట్ కాలేదు. బాలీవుడ్ లో `ధోని.. క‌బీర్ సింగ్` లాంటి సినిమాల్లో న‌టించి మెప్పించింది. కానీ శంక‌ర్ తో ఎలివేష‌న్ వేరు! అందుకే ఆర్సీ 15 ఛాన్స్ ని ఓ గొప్ప అవ‌కాశంగా భావిస్తోంది.ఈ సినిమాలో బెస్ట్ పెర్సామెన్స్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నిస్తాన‌ని కియ‌రా తెలిపింది. శంక‌ర్ నుంచి ఆఫ‌ర్ రాగానే మ‌రో ఆలోచ‌నే లేకుండా ఓకే చెప్పాక‌.. తాను ఎంతో నెర్వ‌స్ గా ఫీల‌వుతున్న‌ట్లు తెలిపింది. ఈ మూవ్ మెంట్ ఎప్ప‌టికీ గుర్తిండిపోతుందని ఎగ్జ‌యిట్ అయ్యింది.

అలాగే ఈ సినిమా త‌ర్వాత సౌత్ లో మ‌రిన్ని పెద్ద‌ అకాశాలొస్తాయ‌ని కియ‌రా భావిస్తోంది. భ‌ర‌త్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కియ‌రా ఆ వెంట‌నే విన‌య విధేయ రామ లో న‌టించింది. ఇక విన‌య విధేయ రామ‌లో కియ‌రా పాత్ర‌కు అంత‌గా ప్రాధాన్య‌త లేక‌పోవ‌డం మైన‌స్ గా క‌నిపించింది. ఇప్పుడు మ‌రోసారి చ‌ర‌ణ్ తో ఛాన్స్ ద‌క్కించుకుంది. ఈ సినిమాతో ఇంకా త‌న‌లో ఉన్న అన్ని సందేహాలు ప‌టాపంచ‌ల్ అయిపోతాయ‌ని కియ‌రా ధీమాను వ్య‌క్తం చేసింది. ఆర్ సీ 15 లో అవ‌కాశం.. అదీ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించడం గొల్డెన్ ఛాన్స్ అంటూ చెప్పుకొచ్చింది. తాజాగా కియ‌రా ఫోటోషూట్ల‌లోనూ వేడి పెరిగింది. ఇంత‌కుముందు ర‌క‌ర‌కాల సంద‌ర్భాల్లో కియ‌రా వైట్ అండ్ వైట్ లో ద‌ర్శ‌న‌మిచ్చిన ఓ ఫోటోల బంచ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.