Begin typing your search above and press return to search.

మెగాస్టార్ మూవీలో రాంచరణ్ ఎంట్రీ సీన్.. అప్పుడేనట!

By:  Tupaki Desk   |   26 Jan 2021 5:30 PM GMT
మెగాస్టార్ మూవీలో రాంచరణ్ ఎంట్రీ సీన్.. అప్పుడేనట!
X
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ సినిమా ఆచార్య.. ఈ సినిమా పై రోజురోజుకి అంచనాలు భారీగా పెంచుతున్నారు మేకర్స్. ఈ సినిమాను డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండగా మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ మరియు కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే చాలావరకు ఆచార్య చిత్రీకరణ పూర్తయిందట. అసలు గతేడాదిలోనే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదల కావాల్సిన ఆచార్య.. లాక్ డౌన్ కారణంగా వాయిదాపడింది. సామాజిక అంశాలకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి సినిమాలను రూపొందించడంలో డైరెక్టర్ కొరటాల శివ దిట్ట అనిపించుకున్నాడు. ఈ సినిమాలో కూడా మెగాస్టార్ పాత్రను చాలా స్ట్రాంగ్ గా చూపించబోతున్నాడట శివ. ముఖ్యంగా మెగాస్టార్ ఎంట్రీ డైలాగ్స్ ఎలివేషన్స్ థియేటర్లలో విజిల్స్ వేయిస్తాయని కొరటాల తెలిపాడు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఇదిలా ఉండగా.. ఆచార్య సినిమాలో రాంచరణ్ కూడా ఓ ముఖ్యమైన క్యారెక్టర్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఓ విద్యార్ధి నాయకుడుగా కనిపిస్తాడని టాక్ నడుస్తుంది. అయితే రాంచరణ్ ఓ కీలక పాత్రలో మాత్రమే కనిపిస్తాడు కాబట్టి అతని ఎంట్రీ ఎప్పుడు ఉండబోతుందని మెగా అభిమానులలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దానికి సమాధానం తాజాగా దొరికిందట. అదేంటంటే ప్రస్తుతం ఆచార్య ఇంటర్వెల్ సన్నివేశాలను షూట్ చేస్తున్నాడట డైరెక్టర్. అయితే రాంచరణ్ కూడా ఇటీవలే షూటింగ్ లో పాల్గొన్నాడు కాబట్టి ఇంటర్వెల్ టైంలోనే అతని ఎంట్రీ ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ దేవాదాయశాఖకు చెందిన అధికారిగా కనిపించబోతున్నాడని విషయం తెలిసిందే. అందుకే ప్రస్తుతం భారీ టెంపుల్ సెట్ లో షూటింగ్ జరుగుతుంది. మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. చూడాలి మరి ఆచార్య ఎలాంటి సందేశం ఇస్తాడో..!