Begin typing your search above and press return to search.

మ‌హేష్ మేన‌ల్లుడి కోసం చెర్రీ-రానా..!

By:  Tupaki Desk   |   13 Jan 2022 10:09 AM GMT
మ‌హేష్ మేన‌ల్లుడి కోసం చెర్రీ-రానా..!
X
సూపర్ స్టార్ కృష్ణ మనవడు .. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 15న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. నేటి సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్న సంగతి తెలిసిందే.

ఈ ఈవెంట్ ని మరింత ప్రత్యేకంగా ఎలివేట్ చేసేందుకు మేకర్స్ బిగ్ ప్లానింగ్స్ సిద్ధం చేశారు. చ‌ర‌ణ్ తో పాటు భ‌ళ్లాల దేవ‌ రానా దగ్గుబాటిని కూడా అతిథిగా ఆహ్వానించారట‌. అంతేకాకుండా ఈ గ్రాండ్ ఈవెంట్ కు మ‌హేష్ స‌న్నిహితుడైన స్టార్ డైరెక్ట‌ర్ లు కొరటాల శివ‌.. అనిల్ రావిపూడి .. శివ నిర్వాణ కూడా ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నారు. హైద‌రాబాద్ పార్క్ హయత్ లో రాత్రి 07:30 గంటల నుంచి ఈ భారీ ఈవెంట్ జరుగుతుంది.

గ‌ల్లా అశోక్ మంత్రి గ‌ల్లా జ‌య‌దేవ్ కుమారుడు అన్న సంగ‌తి తెలిసిందే. ఈ సంక్రాంతి రిలీజ్ సంద‌ర్భంగా తిరుమ‌ల తిరుప‌తి వెంకటేశుని మొక్కు తీర్చుకునేందుకు హీరో త‌న తండ్రి గారితో పాటు తిరుమ‌ల‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. అమర రాజా మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్‌పై పద్మావతి గల్లా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దిల్ రాజు సోద‌రుని కుమారుడు ఆశిష్ న‌టించిన రౌడీ బోయ్స్ తో పోటీప‌డుతూ హీరో బ‌రిలో దిగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు డెబ్యూ హీరోల న‌డుమ‌ సంక్రాంతి పోటీ ఆస‌క్తిక‌రంగా మారింది. విక్ట‌రీ ఎవ‌రిది? అన్న‌ది తేలాల్సి ఉంటుంది.