Begin typing your search above and press return to search.

మ‌హేష్ అల్లుడి కోసం రంగంలోకి మెగా హీరో

By:  Tupaki Desk   |   12 Jan 2022 12:58 PM GMT
మ‌హేష్ అల్లుడి కోసం రంగంలోకి మెగా హీరో
X
ఒక హీరో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కి మ‌రో హీరో గెస్ట్ గా రావ‌డం... ఓ హీరో ఫ్యామిలీ హీరో కోసం మ‌రో ఫ్యామిలీకి చెందిన స్టార్ హీరోలు స‌పోర్ట్ గా నిల‌వ‌డం ఈ మ‌ధ్య టాలీవుడ్ లో చూస్తున్నాం. స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు కుటుంబం నుంచి ఆశీష్ రెడ్డి హీరోగా ప‌రిచ‌యం అవుతున్న విష‌యం తెలిసిందే. `రౌడీబాయ్స్‌` పేరుతో రూపొందిన ఈ మూవీ జ‌న‌వ‌రి 14న సంక్రాంతికి థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతోంది. ఈ మూవీ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో స్టార్ హీరోలు జోరుగా పాల్గొంటున్నారు.

ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ లో బ‌న్నీ పాల్గొని స‌పోర్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ఇదే త‌ర‌హాలో మ‌రో మెగా హీరో రామ్ చ‌ర‌ణ్ ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీ నుంచి హీరోగా ప‌రిచ‌యం అవుతున్న సూప‌ర్ స్టార్ కృష్ణ మ‌న‌వ‌డు, స్టార్ హీరో మ‌హేష్ బాబు మేన‌ల్లుడు గ‌ల్లా అశోక్ కోసం రంగంలోకి దిగుతున్నారు. గ‌ల్లా అశోక్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న మూవీ `హీరో`. నిధి అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రం జ‌న‌వ‌రి 15న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

ఈ నేప‌థ్యంలో ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌ని ప్పీడ‌ప్ చేశారు. ఇటీవ‌ల ప్రీరిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసినా స‌డ‌న్‌గా మ‌హేష్ సోద‌రుడు, హీరో ర‌మేష్ బాబు మృతిచెంద‌డంతో వాయిదా వేసిన మేక‌ర్స్ ఈ గురువారం అంటే జ‌న‌వ‌రి 13న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ లో ముందు అనుకున్న మ‌హేష్ బాబు పాల్గొనాల్సింది. ర‌మేష్ బాబు మృతి చెంద‌డం, అదే స‌మ‌యంలో మ‌హేష్ కోవిడ్ బారిన ప‌డ‌టంతో ఆయ‌న రాలేని ప‌రిస్థితి.

దీంతో త‌న స్నేహితుడి మేన‌ల్లుడి కోసం హీరో రామ్ చ‌ర‌ణ్ రంగంలోకి దిగారు. మ‌హేష్ రాలేని లోటుని తీర్చ‌డానికి ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక‌లో రామ్ చ‌ర‌ణ్ పాల్గొన‌బోతున్నారు. తాజాగా మేక‌ర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన పోస్ట‌ర్ ని రిలీజ్ చేసింది. ఇదిలా వుంటే ఈ మూవీ ఓపెనింగ్ షాట్ కి క్లాప్ కొట్టిన రామ్ చ‌ర‌ణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ పాల్గొంటూ గ‌ల్లా అశోక్ కు స‌పోర్ట్ గా నిలుస్తున్నందుకు అంతా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.