Begin typing your search above and press return to search.
వివాదం పక్కనపెట్టి డైరెక్టర్ రాంచరణ్ సినిమా పట్టాలెక్కిస్తాడా..??
By: Tupaki Desk | 27 May 2021 8:00 PM ISTకొంతకాలంగా మెగాపవర్ స్టార్ రాంచరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న పొలిటికల్ యాక్షన్ మూవీ పై రోజురోజుకి అంచనాలతో పాటు గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా రాంచరణ్ కెరీర్ లో 15వది కావడం విశేషం. ఎందుకంటే ఇంత త్వరగా శంకర్ దర్శకత్వంలో ఛాన్స్ వచ్చేసరికి మెగా ఫ్యాన్స్ ఓ రేంజిలో హ్యాపీ. వినయ విధేయ రామ ఎఫెక్ట్ తర్వాత రాంచరణ్ చాలా జాగ్రత్తగా తదుపరి సినిమాలను లైనప్ చేసుకుంటున్నాడు. రాంచరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడు. ఆ మూవీ ప్రస్తుతం చివరిదశలో ఉంది.
ఆ సినిమా పూర్తి కాగానే రాంచరణ్ - శంకర్ కాంబో మూవీ పట్టాలెక్కనుందని భావిస్తున్నారు. శంకర్ సినిమా బట్టే రాంచరణ్ కెరీర్ ఎలా బిల్డ్ చేసుకుంటున్నాడో అర్ధమవుతుంది. మరోవైపు శంకర్ తో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమా పై ఊహగానాలతో పాటు సమస్యలు కూడా అదేవిధంగా ఎదురవుతున్నాయి. డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం భారతీయుడు సీక్వెల్ వివాదంలో చిక్కుకున్నాడు. ఇటు చూస్తే రాంచరణ్ మూవీకి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. గతకొన్ని నెలలుగా శంకర్ భారతీయుడు సీక్వెల్ వివాదంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీని భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు. కానీ పలు కారణాల వలన సినిమా షూటింగ్ నిలిచిపోయింది. అంతే ముగిసింది అనుకున్న భారతీయుడు సీక్వెల్ వివాదం కోర్టు వరకు వెళ్ళింది. కోర్టులో శంకర్ కు అటు లైకా ప్రొడక్షన్స్ వారికీ హోరాహోరి పోరు జరిగింది. ఇటీవలే సినిమా చేయడానికి అటు శంకర్ ఇటు లైకా సెటిల్మెంట్ చేసుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఇద్దరి మధ్య పరస్పర ఒప్పందాలు క్లియర్ కాలేవట. కానీ తాజా సమాచారం ప్రకారం.. డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం రాంచరణ్ సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నాడట. ముందుగా ఇది ఫినిష్ చేశాకే ఇండియన్ 2 సినిమా పై వర్క్ చేయనున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి మరోవైపు వివాదం అలాగే ఉంది. చూడాలి శంకర్ నెక్స్ట్ స్టెప్ ఏంటో..!