Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్: నాటి గ్లింప్స్ ఏది ర్యాంబో?

By:  Tupaki Desk   |   31 Aug 2019 4:53 AM GMT
ట్రైల‌ర్: నాటి గ్లింప్స్ ఏది ర్యాంబో?
X
సిల్వ‌స్ట‌ర్ స్టాలోన్ న‌టించిన `ర్యాంబో- ఫ‌స్ట్ బ్ల‌డ్` సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. 1982లో రిలీజైన ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా ప‌రిశ్ర‌మ‌ల‌పై ఎంతో ప్ర‌భావం చూపించింద‌ని సినీవిశ్లేష‌కులు చెబుతుంటారు. ఆ సినిమా ఎంద‌రికో స్ఫూర్తి. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ మూవీ `ఖైదీ` తీయ‌డానికి స్ఫూర్తి ర్యాంబో ఫ‌స్ట్ బ్లడ్ అని చెబుతారు. ప‌రుచూరి బ్ర‌ద‌ర్ గోపాల‌కృష్ణ ర‌చ‌న తెలుగు సినిమా సాహిత్యం కథ-కథనం-శిల్పం పుస్త‌కంలోనూ ఫ‌స్ట్ బ్ల‌డ్ గురించి.. ఆ సినిమా ఇచ్చిన స్ఫూర్తి గురించి ప్ర‌స్థావించారు.

భారీ వెప‌న్స్ తో పోరాటం సాగించే క‌థానాయ‌కుడి క‌థ‌తో రివెంజ్ డ్రామా ఫార్మాట్ లో `ఫ‌స్ట్ బ్ల‌డ్` ర‌క్తి క‌ట్టిస్తుంది. ఈ సిరీస్ లో తాజాగా `ర్యాంబో లాస్ట్ బ్ల‌డ్‌` రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాని తెలుగు-త‌మిళం- హిందీ వెర్ష‌న్ల‌లో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. తాజాగా రిలీజైన తొలి ట్రైల‌ర్ లో సిల్వ‌స్ట‌ర్ స్టాలోన్ లుక్ ఆక‌ట్టుకుంది. మ‌రోసారి రివెంజ్ డ్రామా నేప‌థ్యంలోనే ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. శ‌త్రువులు త‌న‌ని త‌న స్థావ‌రాన్ని వెతుక్కుంటూ వ‌స్తే వారిపై ర్యాంబో ఎలాంటి రివెంజ్ తీర్చుకున్నాడు? అన్న‌ది ట్రైల‌ర్ లో ఆవిష్క‌రించారు. కిడ్నాప‌ర్ల చెర నుంచి విడిపించేందుకు అమెరికా బార్డ‌ర్ ని క్రాస్ చేసిన మెక్సిక‌న్ గా క‌థానాయ‌కుడు క‌నిపించ‌నున్నారు.

ఈ సిరీస్ మునుప‌టి సినిమాల్లానే భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ సినిమా ఉండ‌బోతోంద‌ని అర్థ‌మ‌వుతోంది. అయితే స్టాలోన్ ఏజ్ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.. కాబ‌ట్టి ఇక ఈ ఫ్రాంఛైజీలో ఇక‌పై వేరొక సినిమా లేద‌ని చెబుతూనే `లాస్ట్ బ్ల‌డ్` అంటూ టైటిల్ పెట్టార‌ని అనిపిస్తోంది. స్టాలోన్ యుక్త‌వ‌య‌సులో ఉన్న‌ప్పుడు ఫ‌స్ట్ బ్ల‌డ్ వ‌చ్చింది. ఈ ఏజ్ లో ఆ గ్లింప్స్ ఆశించ‌డం క‌రెక్ట్ కాదేమో.