Begin typing your search above and press return to search.
రామాయణ్ తో ఆదిపురుష్ ని పోల్చలేను!
By: Tupaki Desk | 18 Jun 2023 5:10 PM ISTరాఘవుడిగా ప్రభాస్..జానకిగా కృతిసనన్ నటించిన `ఆదిపురుష్` భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఓం రౌత్ దర్శకత్వం వహించిన సినిమా మొదటి రోజు ఏకంగా 140 కోట్లకు పైగా ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లని సాధించింది. అయితే సినిమాపై తొలి షోతేనే నెగిటివ్ టాక్ మొదలైంది. సినిమాకి పాజిటివ్ వైబ్ తక్కువగా నెగిటివ్ వైబ్ ఎక్కువగా తొలి షో అనంతరం నుంచే వినిపిస్తుంది. అయితే డార్లింగ్ ఇమేజ్ తో మొదటి రోజు 140 కోట్లు తెచ్చిన సినిమా ఆ తర్వాతి రోజు చల్లబడిపోయింది.
తాజాగా ఈ సినిమాపై `రామాయణ్` దర్శకుల్లో ఒకరైన మోతీ సాగర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. `ఆదిపురుష్ తీసే ముందు యూనిట్ ముందే జాగ్రత్త పడాల్సింది. ఇందులో విజువల్ ఎఫెక్స్ట్..వ్యవహారిక భాష..మనోజ్ ముంతాసీర్ శుక్లా రాసిన హానుమంతుడి డైలాగులపై సోషల్ మీడియాలో నిప్పులు కురిపించారు. ప్రేక్షకులుమెచ్చే మార్వెల్ కామిక్స్ తరహాలో చిత్ర బృందం ఈ సినిమా తీసింది. ప్రజలకు అర్దమయ్యే భాషల్లో రామాయణాన్ని చెప్పాలనుకున్నారు. అప్పట్లో రామాయాణాన్ని టీవీ సీరియల్ గా ఎపిసోడ్లు వైజ్ అందించాము కాబట్టి ఎన్నో రోజులు చాలా క్లుప్తంగా చూపింగలిగాం.
కానీ ఈ పౌరాణిక ఇతిహాసాన్ని మూడు గంటల్లో చూపించడం అన్నది సాధ్యం కాదు. కాబట్టి మేము తీసిన `రామాయణం` చిత్రాన్ని `ఆదిపురుష్` తో పొల్చలేను. ఇదొక భిన్నమైన సినిమా. కానీ సినిమా కోసం పడిన కష్టం కనిపిస్తుంది. పాటలు..షూటింగ్ కోసం చాలా శ్రమించారు. నటీనటులు చాలా కష్టపడి పనిచేసారు` అని అభిప్రాయపడ్డారు. అలాగే హనుమంతుడి పాత్రపై కొన్ని రాజకీయ పార్టీలు విమర్శించాయి.
ప్రజల భావోద్వేగాలు కించపరిచేలా కొన్ని డైలాగులు ఉన్నాయంటూ కాంగ్రెస్..శివసేన..ఆప్ పార్టీలు విమర్శించాయి. రామాయణ్ ఎందరో మనసులు దోచుకుంది. కానీ ఈ సినిమా అభిమానుల్ని సైతం బాధపెట్టిందని మండిపడ్డారు. ఇలాంటి డైలాగులు ఉపయోగించడం సిగ్గు చేటు అంటూ రామాయణ్ లోని లక్ష్మణుడి పాత్ర పోషించిన సునీల్ లహ్రా తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ఇలా ఇష్టానుసారం ఇతిహాసాన్ని ఎలా తీస్తారు? ఆ రైట్ ఎవరిచ్చారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.