Begin typing your search above and press return to search.

డ్యూటీ ఎక్కిన రవితేజ.. శివరాత్రికి రామారావు టీజర్..!

By:  Tupaki Desk   |   26 Feb 2022 11:04 AM GMT
డ్యూటీ ఎక్కిన రవితేజ.. శివరాత్రికి రామారావు టీజర్..!
X
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెడుతూ బిజీగా ఉన్నారు. అందులో ''రామారావు ఆన్ డ్యూటీ'' సినిమా ఒకటి. నూతన దర్శకుడు శరత్ మండవ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వాస్తవ సంఘటనల స్పూర్తితో స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నారు.

'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ లుక్ - స్పెషల్ పోస్టర్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో టీజర్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు. మహా శివరాత్రి కానుకగా మార్చి 1న టీజర్ రాబోతోందని తాజాగా ప్రకటించారు. ఈ సందర్భంగా వదిలిన మాసివ్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

ఫార్మల్ డ్రెస్ లో నీట్ గా టక్ చేసుకుని అగ్రెసివ్ గా కనిపిస్తున్న రవితేజ.. ఓ రౌడీ చేయి విరుస్తూ అతని గుండెల మీద కాలు పెట్టి ఉండటాన్ని ఈ పోస్టర్ లో చూడొచ్చు. మరో రెండు రోజుల్లో రాబోయే 'రామారావు ఆన్ డ్యూటీ' టీజర్ యాక్షన్ ప్యాక్డ్ గా ఉండబోతోందని ఈ పోస్టర్ సూచిస్తుంది.

'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రంలో రవితేజ ప్రభుత్వోద్యోగిగా కనిపించనున్నారు. దివ్యాంశ కౌశిక్ - రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కీలక పాత్ర పోషిస్తున్నారు. నాజర్ - నరేష్ - పవిత్ర లోకేష్ - తనికెళ్ళ భరణి - రాహుల్ రామకృష్ణ - 'ఈరోజుల్లో' శ్రీ - ‘సర్పట్ట’ జాన్ విజయ్ - సురేఖ వాణి - మధుసూధన్ రావు - చైతన్య కృష్ణ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

RT టీమ్ వర్క్స్ సహకారంతో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్యామ్ సీఎస్ సంగీతం సమకూరుస్తున్నారు. సత్యన్‌ సూర్యన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

మార్చి 1వ తేదీన 'రామారావు ఆన్ డ్యూటీ' టీజర్ రిలీజ్ కానున్న నేపథ్యంలో మాస్ మహారాజా రవితేజ సోషల్ మీడియాలో హ్యాండిల్ నేమ్ ను మార్చారు. తన పేరుకు 'ఆన్ డ్యూటీ' అంటూ మొదటిసారిగా తన సినిమా పేరుకి సంబంధించి ప్రొఫైల్ పేరును అప్‌ డేట్ చేసారు రవితేజ. ఈ చిత్రాన్ని జనాల్లోకి గట్టగా తీసుకెళ్లడానికి హీరోతో పాటుగా మిగతా టీమ్ అంతా డ్యూటీ ఎక్కినట్లు సింబాలిక్ గా తన పేర్లకు 'ఆన్ డ్యూటీ' ని జోడించారు. సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పై త్వరలోనే క్లారిటీ రానుంది.