Begin typing your search above and press return to search.

సమ్మర్ లో 'రామారావు ఆన్ డ్యూటీ'.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

By:  Tupaki Desk   |   6 Dec 2021 6:18 AM GMT
సమ్మర్ లో రామారావు ఆన్ డ్యూటీ.. రిలీజ్ డేట్ ఫిక్స్..!
X
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నలేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ''రామారావు ఆన్ డ్యూటీ''. కొత్త దర్శకుడు శరత్ మండవ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ముగింపు దశకు చేరుకుంది.

ప్రస్తుతం ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.

'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రాన్ని 2022, మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సోమవారం చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. నిజానికి వేసవి కాలం మార్చి నెలాఖరు నుంచి ప్రారంభం అవుతుంది.

రవితేజ వచ్చే సమ్మర్ సీజన్ ని క్యాష్ చేసుకోడానికి రేసులో దిగాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. రిలీజ్ డేట్ అనౌన్సమెంట్ సందర్భంగా వదిలిన సరికొత్త పోస్టర్ ఆకట్టుకుంటోంది.

రవితేజ ఇందులో రెడ్ షర్ట్ - బ్లాక్ ప్యాంటు ధరించి నీట్ గా టక్ చేసుకొని మ్యాన్లీగా కనిపిస్తున్నారు. అంతేకాదు మాస్ రాజా ఓ కర్రను చేత్తో పట్టుకొని ఎవరి మీదకో విసరడానికి రెడీ అయినట్లు ఈ పోస్టర్ సూచిస్తుంది. అతని బ్యాగ్రౌండ్ లో పెద్ద సంఖ్యలో రైతులు, పోలీసులు కర్రలు పట్టుకొని ఉండటం చూస్తుంటే.. ఇది ఫైట్ సీన్ కు సంబంధించినదని అర్థం అవుతోంది.

వాస్తవ సంఘటనల స్పూర్తితో ఓ స్పెషల్ యాక్షన్‌ థ్రిల్లర్‌ గా 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ - ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇందులో రవితేజ నిజాయితీ గల ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపిస్తారు.

రజిషా విజయన్ - దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. వేణు తొట్టెంపూడి కీలక పాత్ర పోషిస్తున్నారు. నాజర్ - నరేష్ - పవిత్ర లోకేష్ - రాహుల్ రామకృష్ణ - 'ఈరోజుల్లో' శ్రీ - ‘సర్పట్ట’ జాన్ విజయ్ - సురేఖ వాణి - మధు సూధన్ రావు - చైతన్య కృష్ణ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ మరియు RT టీమ్‌ వర్క్స్ బ్యానర్స్ పై సుధాకర్ చెరుకూరిఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. శ్యామ్ సీఎస్ సంగీతం సమకూరుస్తున్నారు.

సత్యన్‌ సూర్యన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. 'క్రాక్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న రవితేజ.. వచ్చే ఏడాది వేసవి ప్రారంభంలో 'రామారావు ఆన్ డ్యూటీ' తో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

ఇదిలా ఉంటే రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ డ్యూయెల్ రోల్ పోషిస్తున్న'ఖిలాడి' సినిమా కూడా రిలీజ్ కు రెడీ అయింది. 2022, ఫిబ్రవరి 11న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ విడుదల కానుంది. అంటే కొన్ని రోజుల గ్యాప్ తోనే మాస్ రాజా రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి థియేటర్లలోకి వస్తున్నాడన్నమాట.