Begin typing your search above and press return to search.

ర‌వితేజ సినిమా అంటే ఒక్క లిప్ కిస్ అయినా..!

By:  Tupaki Desk   |   17 July 2022 3:30 AM GMT
ర‌వితేజ సినిమా అంటే ఒక్క లిప్ కిస్ అయినా..!
X
మాస్ మ‌హారాజ్ ర‌వితేజ లేటు వ‌య‌సులో ఘాటు రొమాన్స్ తో అద‌ర‌గొడుతున్నారు. ఆయ‌న‌ సినిమాల్లో రొమాన్స్ వేరే లెవ‌ల్ ని తాకుతోంది. ఇద్ద‌రు హీరోయిన్లు లేనిదే.. క‌నీసం ఒక లిప్ లాక్ అయినా లేనిదే రాజా క‌థ న‌డిపించ‌డం లేదు.

ఇటీవ‌ల వ‌రుస చిత్రాల‌తో బిజీ అయిపోయిన ర‌వితేజ ఇంత‌కుముందు ఖిలాడీలో ఇద్ద‌రు హాట్ గాళ్స్ తో రొమాన్స్ చేసాడు. ఆ మూవీలో భామ‌లతో లిప్ లాక్ లు వేయ‌డంలోనూ ఎక్క‌డా త‌గ్గ‌లేదు.

ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీలోనూ అంతే స్పీడ్ మీద ఉన్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇందులో ర‌వితేజ మాస్ యాక్ష‌న్ తో అద‌ర‌గొడుతూనే రొమాంటిక్ స‌న్నివేశాల్లో జీవించేస్తున్నాడు. ముఖ్యంగా అందాల క‌థానాయిక‌కు లిప్ లాక్ లు వేస్తూ రొమాన్స్ ని అద‌ర‌గొట్టేశాడు.

యువ‌క‌థానాయిక దివ్యాంశ కౌశిక్ తో ఘాటైన లిప్ లాక్ లు వేసాడు ర‌వితేజ‌. దివ్యాంశ ఇంత‌కుముందు నాగ‌చైత‌న్య తో మ‌జిలీ చిత్రంలో ఘాటైన రొమాన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మాస్ రాజాతో మ‌రోసారి చెల‌రేగిపోయింది. హీరోయిన్ తో ర‌వితేజ రొమాన్స్ కూడా ఈ సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ కానుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

రామారావు ఆన్ డ్యూటీ త‌ర్వాత ర‌వితేజ వ‌రుస చిత్రాల్లో న‌టిస్తున్నాడు. రావణాసుర‌.. ధ‌మాకా- టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. వాట్టేర్ వీర‌న్న చిత్రంలో చిరుతో క‌లిసి క‌నిపించ‌నున్నాడు.

ఈ సినిమాల్లోనూ సెంటిమెంట్ గా ముద్దు స‌న్నివేశాల‌ను కంటిన్యూ చేస్తాడేమో చూడాలి. 1995 నాటి య‌థార్థ గాధ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత‌రం లో వేణు తొట్టెంపూడి ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. జూలై 29న ఈ చిత్రం విడుద‌ల కానుంది.