Begin typing your search above and press return to search.

డబుల్ స్ట్రాంగ్ సాంగ్ కోసం రామారావు ఆన్ డ్యూటీ..!

By:  Tupaki Desk   |   12 Jan 2022 7:50 AM GMT
డబుల్ స్ట్రాంగ్ సాంగ్ కోసం రామారావు ఆన్ డ్యూటీ..!
X
మాస్ మహారాజా రవితేజ లైన్ లో పెట్టిన క్రేజీ ప్రాజెక్ట్స్ లో ''రామారావు ఆన్ డ్యూటీ'' ఒకటి. కొత్త దర్శకుడు శరత్ మండవ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది వాస్తవ సంఘటనల స్పూర్తితో రూపొందుతున్న స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో రవితేజ సరసన రజిషా విజయన్ - దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

శరవేగంగా జరుగుతున్న 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమాలోని 'సీసా' అనే స్పెషల్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన మేకర్స్.. ఈ పాట షూటింగ్ కు సంబంధించిన ఓ ఫోటోని షేర్ చేశారు.

'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలోని డబుల్ స్ట్రాంగ్ సాంగ్ షూట్ ప్రోగ్రెస్‌ లో ఉందని.. శేఖర్ మాస్టర్ దీనికి కొరియోగ్రఫీ చేస్తున్నారని మేకర్స్ తెలిపారు. శ్యామ్ సీఎస్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. సత్యన్‌ సూర్యన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

RT టీమ్ వర్క్స్ సహకారంతో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రవితేజ నిజాయితీ గల ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మరియు ఇతర స్పెషల్ పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ లభించింది.

ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కీలక పాత్ర పోషిస్తుండగా.. నాజర్ - నరేష్ - పవిత్ర లోకేష్ - రాహుల్ రామకృష్ణ - 'ఈరోజుల్లో' శ్రీ - ‘సర్పట్ట’ జాన్ విజయ్ - సురేఖ వాణి - మధుసూధన్ రావు - చైతన్య కృష్ణ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సమ్మర్ కానుకగా 2022, మార్చి 25న 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.