Begin typing your search above and press return to search.

రికార్డులు తిరగరాసిన ఎన్టీఆర్ భీం టీజర్

By:  Tupaki Desk   |   18 Dec 2020 2:07 PM IST
రికార్డులు తిరగరాసిన ఎన్టీఆర్ భీం టీజర్
X
సరైన కథ పడితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నట విశ్వరూపం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇందుకోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న జూనియర్ కి రాజమౌళి జత కావడంతో అభిమానుల అంచనాలు ఆకాశాన్నంటాయి. వారి ఆశలను ఏ మాాత్రం డిసప్పాయింట్ చేయం అన్నట్టుగా విడుదలైంది ‘ఆర్ఆర్ఆర్’ టీజర్.

ఈ భారీ పీరియాడిక్ చిత్రంలో కొమరం భీం గా నటిస్తున్న తారక్ నుంచి వచ్చిన టీజర్ రికార్డులను తిరగరాస్తోంది. తెలుగులో కనీవినీ ఎరుగని రీతిలో వ్యూస్ వచ్చాయి. టీజర్ రిలీజైన్ దగ్గర్నుంచి గ్రాఫ్ అంతకంతకూ పెరుగుతూ వెళ్లింది. కేవలం వ్యూస్ విషయంలోనే కాకుండా లైక్స్, కామెంట్స్ విభాగంలోనూ ‘నెవర్ బిఫోర్’ అంటూ రికార్డులు నెలకొల్పి సంచనలనం సృష్టించింది. ఈ టీజర్ కు ఐదు లక్షల పైచిలుకు కామెంట్లు వచ్చాయి. దీంతో తారక్ స్టామినా మరోసారి రుజువైంది.