Begin typing your search above and press return to search.

యూట్యూబ్ లో రికార్డు సృష్టించిన కొమరం భీమ్ టీజర్!!

By:  Tupaki Desk   |   16 Jan 2021 3:02 PM GMT
యూట్యూబ్ లో రికార్డు సృష్టించిన కొమరం భీమ్ టీజర్!!
X
టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్‌ - రామ్‌చరణ్‌ కథానాయకులుగా ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ పాన్ ఇండియా మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌'. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా పై దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. పీరియాడిక్ డ్రామాగా, బ్రిటిష్‌ కాలంలో జరిగిన సంఘటనల నేపథ్యంతో ఆర్ఆర్ఆర్ మూవీని రూపొందిస్తున్నారు రాజమౌళి. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్ర రెండు వైవిధ్యమైన షేడ్స్‌ను కలిగి ఉంటుందని సినీ వర్గాలు అంటున్నాయి. ఆల్రెడీ ఓ లుక్‌లో ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ పూర్తి చేయగా, మూడో షెడ్యూల్‌లో మరో యాంగిల్ చూపిస్తాడని టాక్.

డైరెక్టర్ రాజమౌళి ఎన్టీఆర్‌ను సరికొత్తగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నాడట. ఈ నేపథ్యంలో కొన్ని సన్నివేశాల్లో ఎన్టీఆర్‌ సాధారణంగా, మరికొన్ని సన్నివేశాల్లో కండలు తిరిగిన దేహంతో కనిపించనున్నాడట. అందుకోసం తారక్‌ తన బాడీని మేకోవర్‌ కూడా చేసాడు.

అయితే ఇదివరకే రాంచరణ్ బర్త్ డే రోజు 'భీమ్ ఫర్ రామరాజు' స్పెషల్ వీడియో విడుదల చేసి ట్రీట్ ఇచ్చారు రాజమౌళి టీమ్. ఆ వీడియోలో ఎన్టీఆర్ వాయిస్ ఓ రేంజ్ వైబ్రేషన్స్ సృష్టించింది. అలాగే ఎన్టీఆర్ కు సంబంధించిన 'రామరాజు ఫర్ భీమ్' టీజర్ కూడా విడుదల చేసి ట్రీట్ ఇచ్చారు చిత్రబృందం. అయితే కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ వీరంగం సృష్టిస్తాడని ప్రోమో చూస్తే అర్ధమవుతుంది.

అయితే ఎన్టీఆర్ వీడియోకి రాంచరణ్ వాయిస్ ఇవ్వడం విశేషం. ప్రస్తుతం ఎన్టీఆర్ రామరాజు ఫర్ భీమ్ టీజర్ యూట్యూబ్ లో రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఇప్పటికే 39మిలియన్ల పైగా వ్యూస్ సొంతం చేసుకున్న ఈ వీడియో 11.6 లక్షల కామెంట్స్ దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కామెంట్స్ చేయబడిన వీడియోగా ఎన్టీఆర్ టీజర్ రికార్డు నమోదు చేసింది. ఇప్పుడు అదే టీజర్ ను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా 'అన్ బీటబుల్ భీమ్ టీజర్' అనే హ్యాష్ ట్యాగ్ తో వైరల్ చేసున్నారు.