Begin typing your search above and press return to search.

'ఆర్.ఆర్.ఆర్' క్లైమాక్స్ కోసం చేతులు కలిపిన రామరాజు - భీమ్..!

By:  Tupaki Desk   |   19 Jan 2021 5:27 PM IST
ఆర్.ఆర్.ఆర్ క్లైమాక్స్ కోసం చేతులు కలిపిన రామరాజు - భీమ్..!
X
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ ''ఆర్.ఆర్.ఆర్''. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో చరణ్ 'మన్నెం దొర అల్లూరి సీతారామరాజు'గా.. తారక్ 'కొమరం భీమ్'గా నటిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లో అలియా భట్‌ - ఒలీవియా మోరిస్‌ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో తిరిగి షూటింగ్ ప్రారంభించిన రాజమౌళి శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నాడు. 'ఆర్.ఆర్.ఆర్' అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినీ అభిమానులకు తాజాగా చిత్ర యూనిట్ అదిరిపోయే న్యూస్ అందించింది.

'ఆర్‌.ఆర్.ఆర్' భారీ క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభమైందని.. భీమ్ - రామరాజు కలిసి వారు సాధించాలనుకున్నది నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారని చిత్ర యూనిట్ తెలిపింది. ఈమేరకు తారక్ - చరణ్ ఇద్దరు చేతులను కలిపి ఉన్న ఓ ఫోటోను షేర్ చేసారు. ఇకపోతే ఈ నెల 26న రిపబ్లిక్‌ డే సందర్భంగా రాజమౌళి 'ఆర్‌.ఆర్.ఆర్' స్పెషల్‌ టీజర్‌ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ - శ్రియా - సముద్రఖని వంటి స్టార్స్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా 'ఆర్.ఆర్.ఆర్' ను నిర్మిస్తున్నారు.